నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan Ram ) హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న సినిమా డెవిల్.అభిషేక్ నామా ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా దర్శకుడికి మరియు నిర్మాతకు మధ్య విభేదాలు తలెత్తినట్లుగా ఉన్నాయి.అందుకే పోస్టర్స్ లో మరియు ప్రమోషనల్ స్టఫ్ లో దర్శకుడి పేరు కనిపించడం లేదు.
గతంలో దర్శకుడి పేరును వేసినా కూడా ఇప్పుడు మాత్రం ఆ పేరు కనిపించడం లేదు.దాంతో అసలు ఏం జరిగింది అంటూ అంతా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
బింబిసార( Bimbisara ) సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ మరో భారీ విజయం కోసం వెయిట్ చేస్తున్నాడు.ఇలాంటి సమయంలో కళ్యాణ్ రామ్ కి ఒక సక్సెస్ దక్కక పోవడం తో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారి కోసం అన్నట్లుగా డెవిల్( Devil movie ) ఉంటుంది.కచ్చితంగా బింబిసార ను మించిన వసూళ్లు నమోదు చేస్తుందని అంతా భావిస్తున్నారు.ఇలాంటి సమయంలో దర్శకుడి వివాదం వల్ల సినిమా ఎలా ఉంటుందో అనే అనుమానాలు కొందరు సోషల్ మీడియా వేదిక గా వ్యక్తం చేస్తున్నారు.పెద్దగా అనుభవం లేని అభిషేక్ నామా( Abhishek Nama ) ఈ సినిమా కు దర్శకత్వం వహించాడు.
అంటే సగం కు పైగా దర్శకుడు వేరు.ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్న దర్శకుడు వేరు.
కనుక ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డెవిల్ దర్శకుడి విషయం గురించి చర్చ జరుగుతోంది.మరి డెవిల్ విషయం లో అసలు ఏం జరిగింది అనేది ప్రమోషన్ సమయం లో హీరో కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.కళ్యాణ్ రామ్ సినిమా ల విషయం లో ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం ఉంటుంది.
ఈసారి ఇలా దర్శకుడి విషయం లో విమర్శలు ఎదురు అవుతున్న నేపథ్యం లో విడుదల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.