కవితకు మరిన్ని చిక్కులు.. కీలక విషయాలు వెల్లడించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందుతుడు !!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కేసీఆర్ కుటుంబ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.ఈ కేసులో అరెస్ట్ అయిన వారిని ప్రశ్నించిన ఈడీ వారి దగ్గర కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తుంది.

 Kalvakuntla Kavitha In Delhi Liquor Scam Case,kavitha Reaction On Ed Searches, E-TeluguStop.com

కీలక నిందుతుల్లో ఒకరు నుండి కవిత పాత్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈడీ రాబట్టినట్లు తెలుస్తుంది.ఈ పరిణామం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మరింత ఇబ్బందిగా మారునుంద.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారిపై ఇప్పటికే కేంద్ర సంస్థలు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా తెలంగాణలో అరెస్ట్ వారు అధికార టీఆర్‌ఎస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే కావడం గమనార్హం.

ఈ కేసులో ప్రధాన అనుమానితులుగా ఉన్న చెన్నమనేని శ్రీనివాసరావు, అకా గోల్డ్‌స్టోన్ శ్రీనివాసరావును వచ్చే వారం ఢిల్లీకి తీసుకేళ్ళి విచారించనున్నట్లు ఈడీ తెలిపింది.

ఈ కేసులో విచారిస్తున్న వారిలో గండ్ర ప్రేంసాగర్, బోయిన్పల్లి అభిషేక్, శ్రీధర్, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లై ఉన్నారు.

వీరంతా కేటీఆర్, కల్వకుంట్ల కవిత ఇద్దరికీ సన్నిహితులే.పిళ్లై కుటుంబ సభ్యులతో తిరుపతిలో కవిత దిగిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి స్థానిక ఫార్మా వ్యాపారవేత్తను కూడా ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం.ఈ వ్యక్తులకు ఢిల్లీకి టిక్కెట్లు బుక్ చేసిన ట్రావెల్ ఏజెన్సీలను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Telugu Cm Kcr, Edsearches, Directorate, Kavithaed, Telangana-Political

రామచంద్రన్ పిళ్లై వెల్లడించిన నకిలీ చిరునామాలతో ఉన్న పలు కంపెనీల వివరాలను ఈడీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.అదేవిధంగా రాజ్యసభ ఎంపీ జోగింపల్లి సంతోష్‌కుమార్‌ పాత్ర, గోల్డ్‌స్టోన్‌ శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధంపై కూడా విచారణ చేయనున్నారు.నిజానికి, సంతోష్‌కు చెందిన ఓ సంస్థలో కెటిఆర్ కూడా డైరెక్టర్ల బోర్డులో ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి.అదేవిధంగా, కవితకు చెందిన ఒక సంస్థలో పిళ్లై భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube