తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కల్పికా గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగిపోతోంది.
తెలుగు సినిమాలలో ఈమె ఎక్కువగా హీరోయిన్లకు ఫ్రెండ్ క్యారెక్టర్లలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా యశోద సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.
సినిమాల ద్వారా కంటే ఈమె ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారానే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే అప్పుడప్పుడు కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా ఎవరో ఒకరిపై వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది కల్పికా గణేష్.
ఇటీవలే ఈమె ఒక అవార్డుల ఫంక్షన్ కి పిలవకపోయినా వెళ్ళిన విషయం తెలిసింది.అదే విషయాన్ని కల్పికా నే స్వయంగా స్టేజ్ పైకి ఎక్కి మరి చెప్పుకొచ్చింది.
నన్ను ఎవరు ఈ ఫంక్షన్ కు ఆహ్వానించలేదు, అయినా సరే ఫంక్షన్ కి వచ్చేసాను అంటూ మైకు తీసుకొని మాట్లాడింది.తాజాగా అదే విషయంపై ఆమె మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
నన్నెవరూ పిలవలేదు.కానీ ఇండస్ట్రీని నా ఇల్లుగా భావిస్తాను.
అందుకే పిలవకపోయినా ఏ మొహమాటం లేకుండా వచ్చేశాను.ట్రోల్స్ అంటారా? వాళ్లు చేస్తూనే ఉంటారు.జనాలకు నిజాలేంటో తెలియాలనే చాలామంది నిజ స్వరూపాలను బయటపెడుతున్నాను.

ధనుష్, ధన్య బాలకృష్ణ, అనిరుధ్, బాలాజీ మోహన్.ఇలా కొందరి గురించి అసలు నిజాలు బయటకు రావాలి.సుచీలీక్స్ ఊరికే బయటకు రాలేదు.
చిన్మయి కూడా ఎంతో ఫైట్ చేసింది కానీ ఆమెను క్లోజ్ చేశారు.ఈ కొత్త సంవత్సరంలో ఇంకా చాలామంది బండారాలు బయటపెడతాను అంటూ వార్నింగ్ ఇచ్చింది.
కాగా ఇటీవలే ఆమె సమంత మాదిరిగానే మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.







