ఆరు నెలల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ యువతి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే లైఫ్ సెటిల్ అయినట్లేనని చాలామంది భావిస్తారు.

కేవలం ఆరు నెలల గ్యాప్ లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే ఆ వ్యక్తి అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరని అందరూ ఫీలవుతారు.

కష్టపడితే లక్ష్య సాధన కష్టం కాదని తాజాగా కల్పన మరోసారి ప్రూవ్ చేశారు.రాజస్థాన్ రాష్ట్రంలోని రినౌ గ్రామానికి చెందిన కల్పన ( kalpana )సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

కల్పన పూర్తి పేరు కల్పనా బిర్దా కాగా ఈమె సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువతి కావడం గమనార్హం.ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఈమె పెద్దది కాగా కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలోనే ఈమె ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యారు.

కల్పన ఇన్ స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Advertisement

కల్పన మొదట సీ.హెచ్.ఎస్.ఎల్ లో క్లర్క్ ఉద్యోగం ( Clerk Job in C.H.S.L )సాధించారు.ఆ తర్వాత అడిటర్ గా మరో ఉద్యోగం సాధించిన కల్పన చివరిగా సీజీఎస్టీలో( CGST ) జాబ్ సాధించడం గమనార్హం.

ఢిల్లీలో కొన్నిరోజుల పాటు పోటీ పరీక్షల కోసం ప్రిపరేషన్ సాగించానని ఆమె పేర్కొన్నారు.ఒకవైపు ప్రిపరేషన్ కొనసాగిస్తూనే మరోవైపు రివిజన్ చేసుకున్నానని కల్పన చెప్పుకొచ్చారు.రివిజన్ వల్లే పోటీ పరీక్షలో సులువుగా సక్సెస్ అయ్యానని ఆమె కామెంట్లు చేశారు.

కల్పన భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం కూడా సులువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.కల్పన టాలెంట్ ను నెటిజన్లు మాత్రం తెగ మెచ్చుకుంటున్నారు.

కల్పన బిర్దా తన సక్సెస్ తో గ్రామంలోని ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.కల్పన బిర్దా ప్రణాళికాబద్ధంగా కష్టపడి ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది.

దీపావళి గిఫ్ట్‌తో తల్లిని సర్‌ప్రైజ్ చేసిన కొడుకు.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు