ప్రభాస్ సొంత అన్నలా నాకు సలహాలు ఇచ్చాడు.. కల్కి మూవీ నటుడి కామెంట్స్ వైరల్!

కల్కి 2898 ఏడీ ( Kalki 2898 AD )మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే ఏకంగా 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.హైదరాబాద్ లో ఈరోజు కూడా కల్కి మూవీ బుకింగ్స్ విషయంలో అదరగొడుతోంది.

టైర్2, టైర్3 సిటీలలో ( Tier2 and Tier3 cities )మాత్రం బుకింగ్స్ కొంతమేర తగ్గాయని చెప్పవచ్చు.ఈ సినిమాలో నటించిన ప్రతి నటుడికి కల్కి 2898 ఏడీ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

కల్కి మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.కల్కి సినిమాలో కీలక పాత్రలో నటించిన నటుడు హుంహు( Actor Humhu ) కల్కి మూవీలో అమితాబ్ కాంబినేషన్ లో నాకు ఎలాంటి సీన్లు లేవని అన్నారు.

కల్కి సీక్వెల్ లో అయినా అమితాబ్ కాంబోలో సీన్స్ ఉంటే బాగుంటుందని నేను ఫీలవుతున్నానని హుంహు చెప్పుకొచ్చారు.కల్కిలో ప్రభాస్, దీపికలతో కలిసి కొన్ని సీన్స్ లో నటించానని ఆయన తెలిపారు.

Kalki Actor Humhu Comments About Prabhas And Deepika Details Here Goes Viral , T
Advertisement
Kalki Actor Humhu Comments About Prabhas And Deepika Details Here Goes Viral , T

నేను ప్రభాస్ కు అభిమానినని నాకు సినిమా ఇండస్ట్రీ కొత్త అని హుంహు పేర్కొన్నారు. ప్రభాస్( Prabhas ) నన్ను ఎప్పుడూ డార్లింగ్ అని పిలిచేవాడని ఒక యాక్షన్ సీన్ షూట్ సమయంలో ప్రభాస్ నన్ను పక్కకు తీసుకెళ్లి టిప్స్ చెప్పాడని హుంహు వెల్లడించారు.ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో ప్రభాస్ అన్నీ నేర్పించాడని ఆ నటుడు పేర్కొన్నారు.

వాస్తవానికి ప్రభాస్ కు నాకు దగ్గరుండి నేర్పించాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.

Kalki Actor Humhu Comments About Prabhas And Deepika Details Here Goes Viral , T

ప్రభాస్ నాకు సొంత అన్నలా సలహాలు ఇవ్వడం జరిగిందని హుంహు అన్నారు.దీపికతో నటించాల్సి వచ్చిన సమయంలో కొంత భయపడ్డానని ఆ సమయంలో దీపిక జోక్ చెప్పి నన్ను నవ్వించిందని హుంహు తెలిపారు.వీళ్లు పెద్ద సెలబ్రిటీలు మాత్రమే కాదని పెద్ద మనస్సున్న వాళ్లు అని హుంహు తెలిపారు.

వీళ్లతో కలిసి పని చేయడం నా అదృష్టం అని హుంహు వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు