ప్రముఖ టాలీవుడ్ నటి కాకినాడ శ్యామల ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.జంధ్యాల గారితో నేను చాలా సినిమాలు చేశానని ఆమె అన్నారు.
కైకాల సత్యనారాయణ గారితో కలిసి చాలా సినిమాలు చేశానని ఆమె చెప్పుకొచ్చారు.విశ్వనాథ్ గారితో నేను చేయలేదని ఆమె పేర్కొన్నారు.92 సంవత్సరాలు ఆయన బ్రతికారని కాకినాడ శ్యామల అన్నారు.దేవుడు ఏ రూపాన పిలుస్తాడో తెలియదని ఆమె తెలిపారు.
నేను ఎప్పుడూ ఎవరితో ఎక్కువగా మాట్లాడేదానిని కాదని కాకినాడ శ్యామల అన్నారు.మోహన్ బాబుతో కూడా నేను సినిమాలు చేశానని ఆమె తెలిపారు.నాకు మొహమాటం లేదని ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతానని కాకినాడ శ్యామల అన్నారు.నేను తప్పు చేస్తే మా ఆయనకు తెలియదని కానీ నేను చేయనని ఆమె వెల్లడించారు.
నేను గెస్ట్ హౌస్ లలో ఉండనని హోటల్స్ లో ఉంటానని కాకినాడ శ్యామల పేర్కొన్నారు.

నేను ఫ్లైట్ లో వచ్చేదానినని ఆమె చెప్పుకొచ్చారు.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటే ఒప్పుకోనని అలా అడిగే వ్యక్తులు ఉందని శ్యామల తెలిపారు.అలాంటి ఒకే ఒకే వ్యక్తిని నేను చూశానని ఆమె అన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడని ఆమె ఎన్టీఆర్ వీక్ నెస్ ను క్యాష్ చేసుకుందని కాకినాడ శ్యామల తెలిపారు.ఈ విషయంలో ఆయన తప్పు కూడా ఉందని ఆమె అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ ఎంతో గొప్ప వ్యక్తి అని కానీ ఆయన కూడా ఆడదాని చేతిలో పడిపోయాడని కాకినాడ శ్యామల అన్నారు.బాలయ్య లక్ష్మీ పార్వతిని గౌరవిస్తాడని ఆమె తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగా కూడా చాలా మంచోడని కాకినాడ శ్యామల పేర్కొన్నారు.నేను ఎవరికీ ఎక్కువగా చనువు ఇవ్వనని ఆమె వెల్లడించారు.







