మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పాటు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తు్న్న ఆచార్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.
అయితే ఈ నెల 27న చరణ్ తన 35వ పుట్టిన రోజును జరుపుకోనున్నాడు.
ఈ క్రమంలో చరణ్‌కు పలువురు బర్త్‌డే కానుకలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలో చరణ్ డై హార్డ్ ఫ్యాన్స్ కొందరు ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని చరణ్ పేరుపై ఓ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు.ఈ పాటకు సంబంధించిన వీడియోను టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సోషల్ అకౌంట్‌లో రిలీజ్ చేసింది.
తనతో కలిసి మగధీర వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నాని చెప్పుకొచ్చిన కాజల్, ఈ సందర్భంగా చరణ్‌కు అడ్వాన్స్ బర్త్‌డే విషెస్ చెప్పింది.
కాగా చరణ్ బర్త్‌డే సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెగా ఫ్యాన్స్ ఈ పాటను తెగ షేర్ చేస్తూ తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్ నిన్న ఉగాది కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.







