స్టార్ హీరోయిన్ గా దశాబ్ద కాలం పాటు సౌత్ లో తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోయిన అందాల భామ కాజల్ అగర్వాల్.లక్మి్న కల్యాణం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మగదీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది.అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఎదిగింది.
ప్రతి ఏడాది కనీసం రెండు నుంచి మూడు సినిమాలు చేస్తూ కాజల్ అగర్వాల్ ఫుల్ బిజీగా ఉంది.ప్రస్తుతం ఆమె చేతిలో తమిళ్ లో మూడు సినిమాలు, తెలుగులో రెండు సినిమాలు ఉన్నాయి.
వాటిలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, కమల్ హసన్ జోడీగా చేస్తున్న సినిమాలు ఉండటం విశేషం.
ఇదిలా ఉంటే గత ఏడాది ఈ బ్యూటీ తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టింది.
అలాగే సినిమాలు చేస్తూనే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది.వెంకట్ ప్రభు దర్శకత్వంలో లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించి సక్సెస్ అందుకుంది.ప్రస్తుతం ఆమె చేతిలో మరో వెబ్ సిరీస్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ అకస్మాత్తుగా తన ఫ్యూచర్ ప్లానింగ్ ని మార్చేసుకుంది.
ప్రస్తుతం చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి తాను చేయాలని అనుకున్న ఏంబీఏ పూర్తి చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఏంబీఏ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తానని చెప్పింది.
ఇప్పటికే తన భర్తతో కలిసి ఇంటీరియర్ వ్యాపారంలో కూడా భాగస్వామిగా కాజల్ అగర్వాల్ మారిపోయిన సంగతి తెలిసిందే.దీనికోసం ఎంబీఏ చేయడానికి ఆమె ఆసక్తి చూపిస్తున్నట్లు బోగట్టా.