భారీగా కష్టపడుతున్న కాజల్.. రీ ఎంట్రీకి అంతా సిద్ధం!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో టాప్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

 Kajal Aggarwal Learns Martial Arts Kamal Haasan Indian 2 Movie, Kajal Aggarwal,-TeluguStop.com

మొదటి లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్ మొదటి సినిమాతోనే తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.ఆ తర్వాత వరుసగా అవకాశాలు అంటూ వెను తిరిగి చూసుకోకుండా దూసుకుపోయింది.

కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా హిందీ తమిళ సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్.

 Kajal Aggarwal Learns Martial Arts Kamal Haasan Indian 2 Movie, Kajal Aggarwal,-TeluguStop.com

తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించింది.

ఇకపోతే కాజల్ అగర్వాల్ చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ దంపతులకు పండంటి మగ బిడ్డ కూడా జన్మించాడు.

పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత గర్భం దాల్చడంతో కొద్దిరోజులపాటు సినిమాలకు దూరంగా ఉంది.ఇక ఇటీవలే ఆమె పన్నెంటి బిడ్డకు జన్మనివ్వడంతో ఆ తర్వాత ఆమె కాస్త బొద్దుగా తయారైంది.

ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు తన బిడ్డ బాగోగులు చూసుకుంటూ వెండితెరకు దూరంగా ఉన్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.ఈ క్రమంలోనే తల్లి కావడంతో శరీరాకృతిలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఫిట్నెస్ పై దృష్టిని పెట్టింది.ఇందుకోసం జిమ్ లో వర్కౌట్ చేస్తూ చెమటలు చిందిస్తోంది.అంతేకాకుండా తన తదుపరి సినిమా ఇండియన్ 2 సినిమా కోసం ఇటీవల గుర్రపు స్వారిని నేర్చుకున్న కాజల్ అగర్వాల్ తాజాగా మార్షల్ ఆర్ట్స్ పై దృష్టిని పెట్టింది.

ఒకవైపు హీరోయిన్ గా రాణిస్తూనే మరొకవైపు తల్లిగా బాధ్యతలు కూడా చేపట్టాలి అని కాజల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube