వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు.
అయితే కొడుకు జన్మించిన అనంతరం తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అంటూ వార్తలు వచ్చాయి.ఈమె మరోసారి తల్లి కాబోతుందని అందుకే సినిమాలకు దూరం కాబోతున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి.

ఇలా కాజల్ అగర్వాల్ రెండోసారి తల్లి( Kajal Pregnant ) కాబోతుందన్న శుభవార్త తెలిసినప్పటికీ ఈమె సినిమాలకు దూరం అవుతున్నారన్న వార్త అభిమానులను ఆందోళన కలిగించింది.అయితే కాజల్ అగర్వాల్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదంటూ కాజల్ అగర్వాల్ తన కొత్త చిత్రాన్ని( New Movie ) ప్రకటిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.కాజల్ అగర్వాల్ తన తదుపరిచిత్రాన్ని # కాజల్ 60 లో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది.ఇక కాజల్ అగర్వాల్ జూన్ 19వ తేదీ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఈమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్ వీడియోని విడుదల చేయనున్నారు.ఇక ఈ సినిమాకి అఖిల్ డేగల ( Akhil Degala ) దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి ఫ్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు.ఇందులో పోలీస్ వాహనం నుంచి చేతికి గాజులు వేసుకొని చేతిని బయటపెట్టినట్టు చూపించడంతో ఈ పోస్టర్ కాస్త ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ సినిమాలో కాజల్ ఇదివరకు ఎప్పుడు కనిపించని విధంగా విభిన్న పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.కొత్త సినిమాలు ప్రకటించడంతో తాను సినిమాలకు దూరమవుతారు అంటూ వచ్చిన వార్తలన్నీ పూర్తిగా ఆ వాస్తవమేనని తాను ఇకపై సినిమాలలో నటిస్తున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







