అందాల భామ కాజల్ అగర్వాల్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా టాలీవుడ్‌లో కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
ఈ బ్యూటీ ఓ సినిమాలో నటిస్తుందంటే, ఆ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఫిక్స్ అవుతారు ఆడియెన్స్.ఇక ఇటీవల కాజల్ పెళ్లి చేసుకోవడంతో, అమ్మడు సినిమాలకు దూరం అవుతుందని అందరూ అనుకున్నారు.
కానీ పెళ్లి తరువాత రెట్టింపు ఉత్సాహంతో వరుసబెట్టి సినిమాలను చేస్తూ దూసుకుపోతుంది.అయితే తాను ఇలా సినిమాలు చేయడానికి ముఖ్య కారణం తన భర్తే అంటోంది ఈ బ్యూటీ.
తన భర్త వల్లే తాను సినిమాలు చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది ఈ చందమామ.తన భర్త గౌతమ్ కిచ్లు తనకు ఇచ్చే సహకారంతోనే తాను ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నట్లు కాజల్ పేర్కొంది.
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలను ఓకే చేస్తూ యమ స్పీడుగా దూసుకెళ్తుంది.మెగాస్టార్ చిరంజవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో పాటు తమిళంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఇండియన్-2’లో కూడా కాజల్ హీరోయిన్‌గా చేస్తోంది.అంతేగాక నాగార్జున చేయబోయే నెక్ట్స్ మూవీలో కూడా కాజల్ నటిస్తోంది.
ఏదేమైనా హీరోయిన్లు పెళ్లి తరువాత సినిమాలు తక్కువ చేయడం, లేక మానేయడం చేస్తుంటే, కాజల్ మాత్రం ఇలా వరుసబెట్టి సినిమాలు చేయడం ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.అయితే తన సినిమాల వెనుక భర్తే కారణమని చెప్పి, ఆయనపై తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పింది ఈ బ్యూటీ.
మరి కాజల్ నటిస్తున్న సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తాయా లేదా అనేది చూడాలి.







