కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టులో ఊరట

కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

ఈనెల 25వ తేదీ వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అదేవిధంగా సీబీఐ విచారణకు సహకరించాలని ఎంపీ అవినాశ్ రెడ్డికి కోర్టు సూచించింది.ఈ క్రమంలోనే అవినాశ్ రెడ్డి రేపటి నుంచి ఈనెల 25 వరకు ప్రతిరోజు విచారణకు వెళ్లాలని ఆదేశించింది.

విచారణ మొత్తాన్ని రికార్డ్ చేయాలని సీబీఐకి స్పష్టం చేసింది.అయితే మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే.

నాగచైతన్య శోభితలను కలిపిన హీరో అతనేనా.. ఈ హీరోకు థ్యాంక్స్ అంటూ?
Advertisement

తాజా వార్తలు