సినిమా ఇండస్ట్రీలో మంచి పేరును సొంతం చేసుకున్న కాదంబరి కిరణ్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.మరోవైపు మనం సైతం ఫౌండేషన్( Manam Saitham ) ద్వారా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసలు పొందుతున్నాయి.
అయితే ఇప్పటివరకు కష్టాల్లో ఉన్న సెలబ్రిటీలకు సాయం చేసిన కాదంబరి కిరణ్ తాజాగా సినిమా ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు బయటి వ్యక్తులకు సైతం సాయం చేశారు.

సీనియర్ నటి, హెయిర్ స్టైలిష్ట్ రంగస్థలం లక్ష్మికి కాదంబరి కిరణ్ 25 వేల రూపాయల సహాయం చేయడం జరిగింది.ముక్కుకు సంబంధించిన సమస్యతో బాధ పడుతున్న విదిష అనే బాలికకు, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న చంద్రకళ అనే యువతికి కాదంబరి కిరణ్ 25 వేల రూపాయల సహాయం చేయడం జరిగింది.తాజాగా పావలా శ్యామల( Pavala Syamala ) కు కాదంబరి కిరణ్ మరో 6,000 రూపాయల సహాయం చేశారని తెలుస్తోంది.

ఈ విషయాలు తెలిసిన నెటిజన్లు కాదంబరి కిరణ్ కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఇదే విధంగా ఆదుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.మనం సైతం ఫౌండేషన్ పేరు కాదంబరి కిరణ్ వల్ల మారుమ్రోగుతోంది.ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందించే మంచి మనస్సు కొంతమందికే ఉంటుందని అలాంటి వాళ్లలో కాదంబరి కిరణ్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.కాదంబరి కిరణ్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.
కాదంబరి కిరణ్ వయస్సు 53 సంవత్సరాలు కాగా నటుడిగా కంటే సేవా కార్యక్రమాల ద్వారా మరింత మంచి పేరును సొంతం చేసుకున్నారు.

కాదంబరి కిరణ్( kadambari kiran) కు దేవుని ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాదంబరి కిరణ్ కు మూవీ ఆఫర్లు సైతం పెరిగితే బాగుంటుందని నెటిజన్ల నుంచి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







