మునుగోడు ఎన్నికలు: తనదైన స్టైల్‌లో ఆకట్టుకుంటున్న కేఏ పాల్!

మునుగోడు ఉప ఎన్నికలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి.అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నాయి.

పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలిఉంది.ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి.

ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు తెలంగాణ జనసమితి, బీఎస్పీ, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర్య అభ్యర్థులు సైతం ప్రచారంలో వేగం పెంచాయి.నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన పార్టీలు గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు వేయాలని వేడుకుంటున్నారు.

అయితే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం ఒక ఎత్తయితే.ప్రజాశాంతి పార్టీ ప్రచారం మరో ఎత్తు.

Advertisement
Ka Paul Is Impressive In His Own Style In The Munugode Elections Campaign Detail

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ మునుగోడు ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు.మునుగోడు ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ.పాల్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఇంటింటికీ వెళ్తూ ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారు.

ఈ మేరకు కొత్త కొత్త హామీలతో ప్రజలందరికీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.కేఏ.పాల్ ఎన్నికల ప్రచారంలో ఎంతో జోష్‌గా ఉంటారు.తన సంభాషణతో ప్రచారంలో నవ్వులు పూయిస్తారు.

అయితే ప్రజలు మాత్రం కేఏ.పాల్ చెబుతున్న మాటలు వింటూనే మధ్య మధ్యలో సెటైర్లు వేస్తున్నారు.వాటికి కేఏ.పాల్ తనదైన శైలిలో సమాధానమిస్తున్నారు.ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు.

కేంద్ర మంత్రులంతా తన శిష్యులు, అభిమానులని చెబుతూ వచ్చారు.ప్రచారంలో భాగంగా కేఏ.పాల్ రోడ్ షోలో పాల్గొన్నారు.

Ka Paul Is Impressive In His Own Style In The Munugode Elections Campaign Detail
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఈ సందర్భంగా కేఏ.పాల్ మాట్లాడుతూ.‘మునుగోడు నియోజకవర్గంలో నేను కచ్ఛితంగా గెలుస్తాను.6 నెలల తర్వాత నేనే సీఎం అవుతాను.బీజేపీ, టీఆర్ఎస్ మునుగోడు అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

Advertisement

ఈ ఎన్నికల్లో 30 వేల మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలుస్తాను.ఎన్నికల్లో గెలుస్తానని తెలిసి కేసీఆర్‌కు నిద్ర కూడా పట్టడం లేదు.

’ అని పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణలోని ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల అప్పులు మిగిల్చారని తెలిపారు.

తాను అధికారంలోకి వస్తే ఒక్కో మండలానికి ఒక్కో కళాశాల, ఆస్పత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్, బీజేపీ అవినీతిని బయటపెడతానని తెలిపారు.

తాజా వార్తలు