అమెరికాలో ఘోర ప్రమాదం...తెలుగు రాష్ట్రాలలో విషాదం..!!!

అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో విషాదం నింపింది.

 Fatal Accident In America Tragedy In Telugu States , Telugu States, America, Sa-TeluguStop.com

ఈ ప్రమాదంలో తెలంగాణా కు చెందిన ఇద్దరు విద్యార్ధులు మృతి చెందగా, ఏపీలోని కడియం కు చెందిన మరొక విద్యార్ధి మృతి చెందారు.ఒక పక్క దీపావళి సంబరాలలో తెలుగు రాష్ట్రాలలో వారి కుటుంబ సభ్యులు ఉండగా, ఈ విషాద వార్తను విని ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

ఇంతకీ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది.కారణాలు ఏంటి.

ఇంకా ఎంత మంది ఈ ప్రమాదానికి గురయ్యారు అనే విషయాలను పోలీసులు వెల్లడించారు.ఏపీ లోని తూర్పుగోదావరి జిల్లాలోని కడియపు లంకకు చెందిన సాయి నరసింహ, ఇదే గ్రామానికి చెందిన సిద్దిరెడ్డి ఐశ్వర్య, తెలంగాణా రాష్ట్రానికి చెందిన ప్రేమ కుమార్, పావని మరో నలుగురు కలిసి అమెరికాలో చదువుకుంటున్నారు.

వీరందరూ కలిసి మినీ వ్యాన్ లో కనెక్టికట్ రాష్ట్రంలో హైవే పై ప్రయాణిస్తున్నారు.ఈ క్రమంలో దట్టంగా మంచు పట్టడంతో మార్గం సరిగా కనపడక పోవడంతో ఎదురుగా ఉన్న వాహన్నాన్ని బలంగా డీ కొట్టారు.

వేగంగా వెళ్తూ డీ కొట్టిన కారణంగా తెలంగాణాకు చెందిన ఇద్దరు విద్యార్ధులు, ప్రేమ కుమార్ , పావని, కడియం కు చెందిన సాయి నరసింహ లు అక్కడికక్కడే మృతి చెందారు.

Telugu America, Americatragedy, Kadiam, Pavani, Prema Kumar, Sai Simha, Siddi Ai

సాయి నరసింహ సొంత గ్రామానికి చెందిన ఐశ్వర్య స్వల్ప గాయాలతో బయటపడగా, మిగలిన నలుగురు కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు.ఒక పక్క దీపావళి వేడుకలు చేసుకుంటున్న వారి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసి షాక్ కి గురయ్యారు.ఆడే రోజు ఉదయం మాతో మాట్లాడారని ఈ లోగా ఇంత దారుణం జరిగిపోయిందని కన్నీరు మున్నీరు అవుతున్నారు.

కడియం కి చెందిన సాయి నరసింహ చెన్నై లో చదువుకుంటున్న క్రమంలోనే మంచి ఉద్యోగం వచ్చిందని కానీ ఏంఎస్ చేయాలనే కోరికతో అమెరికా వెళ్తానంటే పంపామని ఇలాంటి దారుణం ఎవరికి జరగకూడదని సాయి తల్లి తండ్రులు గుండెలు అవిసేలా రోదిస్తున్న సంఘటన అందరిని కలిచివేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube