Radhika : హీరోయిన్ రాధిక ఆ సినిమా షూటింగ్ మొత్తం కిందనే పడుకునేది !

కె.విశ్వనాథ్ దర్శకత్వంలో మమ్ముట్టి, రాధిక ( Radhika )మరియు మాస్టర్ మంజునాథ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా స్వాతి కిరణం.( Swathi Kiranam ) ఈ సినిమా విడుదలై దాదాపు 30 ఏళ్లు గడుస్తోంది.1992లో విడుదలైన ఈ సంగీత ప్రాధాన్య సినిమా అప్పట్లో ఎంత విజయం సాధించిందో మనందరికీ తెలుసు.ఈ సినిమాతోనే మమ్ముట్టి మొట్టమొదటి సారిగా తెలుగులో నేరుగా ఒక చిత్రం లో నటించారు.అయితే ఈ సినిమాకు సంబంధించి కే విశ్వనాథ్ గారు బ్రతికి ఉన్న సమయంలో ఎన్నో విషయాలను తన ఇంటర్వూస్ తో అభిమానులతో పంచుకున్నారు

 K Vishwanath About Radhika In Swathi Kiranam Shooting-TeluguStop.com
Telugu Janaki, Vishwanath, Mammootty, Radhika, Swathi Kiranam, Tollywood-Movie

మాస్టర్ మంజునాథ్ ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా నటించారు, అలాగే మమ్ముట్టి,( Mammootty ) రాధిక సైతం ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశారు అంటూ విశ్వనాథ్ తెలిపారు.మరీ ముఖ్యంగా రాధిక( Radhika ) గురించి చెప్పాలి.ఆమె ఒక గొప్ప నటి… ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే సినిమా షూటింగ్ అంతా ఒక ఆశ్రమం లో తీశాం.

అప్పటికి రాధిక ఒక స్టార్ హీరోయిన్ కానీ వయసు మళ్ళిన పాత్రలో నటించడానికి కథను మాత్రమే నమ్మి ఆమె ఒప్పుకుంది.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో మమ్ముట్టి ఎప్పుడూ చిన్న గ్యాప్ దొరికితే చాలు ఆశ్రమం గేటు బయటకు వెళ్లిపోయి స్మోక్ చేసి మళ్లీ తిరిగి వచ్చేవాడు.

కానీ రాధిక మాత్రం మాతో పాటు గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోనే ప్రసాదం తింటూ నేలపై పడుకుని ఉండేది.నేను బ్రాహ్మణుడిని కాబట్టి ఆ రకమైన పద్ధతులు నాకు అలవాటే.

కానీ రాధిక అలా కాదు.

Telugu Janaki, Vishwanath, Mammootty, Radhika, Swathi Kiranam, Tollywood-Movie

అంత పెద్ద నటి అలా ప్రసాదం తింటూ నేలపై పడుకుని ఎన్నో రోజుల పాటు మాతో కలిసి షూటింగ్లో పాల్గొనడం మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది.ఆ సినిమా విజయం కావడానికి కూడా రాధిక( Radhika ) ముఖ్యమైన కారణం.ఎంత ఎదిగాము అని కాదు ఎంత ఒదిగి ఉన్నాము అనేదే ముఖ్యం.

అందుకు చక్కటి ఉదాహరణ రాధిక.రాధిక గురించి ఎన్ని సార్లు చెప్పినా తక్కువే అంటూ విశ్వనాథ్ గారు ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube