బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహనీయుడు జ్యోతిభాపూలే

సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి,బిసి సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధి బండారి బాల్ రెడ్డి బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతి భాపూలే జయంతి.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంగళవారం జ్యోతి భాపూలే 197 జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

ఎల్లారెడ్డిపేట మండల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పేట పాత బస్టాండ్ లో జ్యోతిభాపూలే 197 వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి బిసి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా జోహార్లర్పించారు.ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి,బిసి సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధి బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ మన దేశంలో సామాజిక దోపిడీ సిద్ధాంతాన్ని ప్రవచించిన మహామహోపాధ్యాయుడు జ్యోతిభాపూలే అని వారు కొనియాడారు.

దేశంలో సామాజిక చైతన్యానికి ప్రప్రధముడు జ్యోతిభాపూలే అని ప్రపంచవ్యాప్తంగా వర్గ సిద్ధాంతం ఎంత ముఖ్యమో దేశ పరిస్థితుల్లో జ్యోతిభా పూలే ప్రవచించిన సామాజిక సిద్ధాంతం అంతే ముఖ్యమైందని వారు తెలిపారు.దేశంలో సామాజిక ఉద్యమాలు మహోజ్వలంగా సాగకుండా అణగారిన వర్గాలకు న్యాయం జరగదని జ్యోతిభా పూలే లేకపోతే సామాజిక ఉద్యమాల ప్రతీకలైన బరోడా రాజు సాహు, డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ లేనని జ్యోతి భాపూలే చెప్పిన గులామ్ గిరి నేటికీ కొనసాగుతోందని దానిని తుదముట్టించడమే మన కర్తవ్యమని వారు అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కంచర్ల రాజు మాట్లాడుతూ పార్టీ లకు అతిథంగా ప్రతియేటా బిసి ఎస్సీ , ఎస్ సి.మైనారిటీ నాయకులందరం కలిసి జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ లు కోసం జ్యోతి భాపూలే అనేక ఉద్యమాలు చేశారని ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా బిసి సంఘం ప్రతినిధి శ్రీ నివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ లకు స్త్రీ, పురుషుల చదువుల కోసం అనేక ఉద్యమాలు చేశారని అతని సతీమణి సావిత్రి భాయి పూలే తో అనేక పాఠశాలలు నెలకోల్పి చదువుకోడానికి ఎంతో కృషి చేశారని అన్నారు, అగ్రవర్ణాల తో ఎన్నో అవమానాలకు గురయ్యారన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధి మీసం రాజం , కంచర్ల నర్సింలు , పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్, శివయ్య గారి కొన్నే చిన్న నరసింహులు, కొన్నే వెంకటి మానుక నాగరాజు , కళ్యాణ్ ,కోలపెల్లి శ్రీనివాస్, కంచర్ల రాజు , మేగి దేవయ్య , చింతకింది శ్రీనివాస్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

తాజా వార్తలు