ఆ టాలీవుడ్ యంగ్ హీరోకి తల్లిగా జ్యోతిక... డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా?

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన వారందరూ కూడా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు .అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్స్ అంతా తల్లులుగా మారబోతున్నారు.

 Jyothika Doing Nagachaitanya Mother Role In Telugu Movie , Nagachaitanya, Jyothi-TeluguStop.com

తల్లి పాత్రలలో చేయమని చెప్పేసిన హీరోయిన్ల చేత తల్లి పాత్రలు చేయిస్తున్నారు మన దర్శకులు.ఇలా ఇప్పటికే దీంతో మంది స్టార్ హీరోయిన్ లో తల్లి పాత్రలలో బిజీగా మారిన సంగతి తెలిసింది.

అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ సైతం తల్లి పాత్రలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఓ ఊపు ఊపినటువంటి నటి జ్యోతిక( Jyothika ) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే త్వరలోనే ఈమె ఓ టాలీవుడ్ హీరోకి తల్లిగా నటించబోతున్నారని సమాచారం.మరి ఏ హీరోకి తల్లిగా కనిపించబోతున్నారు ఏంటి అనే విషయానికి వస్తే.

ప్రస్తుతం నాగచైతన్య( Nagachaitanya ) చందు మొండేటి( Chandu Mondeti ) దర్శకత్వంలో తండేల్( Thandel ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.ఇందులో సాయి పల్లవి ( Sai Pallavi ) హీరోయిన్గా నటిస్తున్నారు ఈ సినిమా తర్వాత విరూపాక్ష సినిమా దర్శకుడు కార్తీక్ దండు ( Karthik Dandu ) దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు.నాగచైతన్య ఈ సినిమాలో ఈయనకు జోడిగా పూజా హెగ్డే ( Pooja Hedge ) కనిపించబోతున్నారు.

అయితే ఈ సినిమాలో నాగచైతన్యకు తల్లి పాత్రలో సీనియర్ నటి జ్యోతిక నటించబోతున్నారని సమాచారం ప్రస్తుతం దర్శకుడు ఈమెతో ఈ పాత్ర పై చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.ఇలా జ్యోతిక నాగచైతన్యకు తల్లిగా కనిపించబోతున్నారనే ఈ వార్తలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube