కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఇలా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది!

కే‌సి‌సి (కిసాన్ క్రెడిట్ కార్డ్) అంటే అందరికీ తెలిసిందే.

దేశీయంగా వ్యవసాయం చేస్తున్న రైతుల( Farmers )కు వివిధ బ్యాంకులు రైతుల కోసమై తక్షణ రుణాన్ని పొందే కార్డుని కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటారు.

రైతులకు వారి పంట ఉత్పత్తి మరియు ఇతర వ్యవసాయ అవసరాల నిమిత్తం తగిన రుణ మద్దతును అందించడానికి 1998లో భారత ప్రభుత్వం ఈ కే‌సి‌సి పథకాన్ని స్టార్ట్ చేసింది.ఈ కార్డ్ ఏటి ‌ఎం నుండి నగదు తీసుకోవడానికి లేదా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మొదలైన వ్యవసాయ ఇన్‌పుట్‌ లను కొనుగోలు చేయడానికి పనికి వస్తుంది.

అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసే విషయంలో చాలమందికి కొన్ని అపోహలు వున్నాయి.ముఖ్యంగా దరఖాస్తు విషయంలో కాస్త తడబడుతున్నారు.అది చాలా సింపుల్.

దానికోసం రైతులు భూమికి( Farmers ) సంబంధించిన రుజువు, గుర్తింపు రుజువు మరియు ఆదాయ రుజువుతో సహా అవసరమైన పత్రాలను సమర్పిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో కిసాన్ క్రెడిట్ కార్డ్ ( KCC ) కోసం చాలా తేలికగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

దానికోసం కే‌సి‌సి కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్ళాలి.

తరువాత దరఖాస్తు బటన్‌పై క్లిక్ చేసి, అడిగిన వివరాలు అనగా మీ వ్యక్తిగత మరియు వ్యవసాయ వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ ను పూర్తిచేయవలసి వుంటుంది.ఆ తరువాత సంబందిత బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ మీ దరఖాస్తును స్వీకరించిన తర్వాత, వారు దానిని ప్రాసెస్ చేయడం జరుగుతుంది.ఆ తరువాత కొన్ని రోజులకు ధృవీకరణ మరియు డాక్యుమెంటేషన్ కోసం మిమ్మల్ని వారే స్వయంగా ఫోనులో సంప్రదిస్తారు.

ధృవీకరణ పూర్తయిన తర్వాత, మీ కిసాన్ క్రెడిట్ కార్డ్ సరాసరి మీ ఇంటికే వచ్చేస్తుంది.అయితే ఇక్కడ ముఖ్యమైన మరో విషయం గుర్తు పెట్టుకోవాలి.మీరు KCC కోసం దరఖాస్తు చేస్తున్న బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను బట్టి ఖచ్చితమైన ప్రక్రియ మరియు అవసరాలు మారే అవకాశం వుంటుంది.

ఈ సంగతి తెలిస్తే, మీరు ఇక పానీపూరి బండివంక కన్నెత్తి కూడా చూడరు!
Advertisement

తాజా వార్తలు