యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.అయితే చంద్రబాబు అరెస్ట్ విషయంలో తారక్ సైలెన్స్ అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.ఎన్టీఆర్ సైలెన్స్ వల్ల అటు చంద్రబాబును( Chandrababu ) ఇటు ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానులు మధ్యలో ఇబ్బంది పడుతున్నారు.
ఎన్టీఆర్ స్పందన విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదనే ప్రశ్నకు సంబంధించి అచ్చెన్నాయుడుకు( Achchennaidu ) ప్రశ్న ఎదురు కాగా తారక్ స్పందించకపోతే తారక్ ను అడగాలే తప్ప తనను అడిగి ఏం లాభమని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేయగా ఆ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.ఎన్టీఆర్ ప్రవర్తనతో అసంతృప్తి చెంది అభిమాని ఈ విధంగా పోస్ట్ పెట్టాడని సమాచారం అందుతోంది.
అభిమాని ఆ పోస్ట్ లో “గతంలో నిన్ను ప్రాణంగా ప్రేమించిన అభిమానిని.ప్రస్తుతం కేవలం నందమూరి కుటుంబ సభ్యుడిగా నిన్ను గౌరవిస్తున్నా అంతే.కొత్తగా ఎవరో వచ్చి సపోర్ట్ చేశాడని, లేదా నీ అవసరం మాకు లేదని నిన్ను అభిమానించడం మానేయలేదు.మా హరన్నలో ఉన్న తెగింపు, మా రామన్నలో ఉన్న ఆవేశం, మా బాలయ్యలో ఉన్న ధైర్యం నీలో కనిపించక.
నీ మొండితనం భరించలేక.నీ లోతైన మనస్తత్వం అర్థం చేసుకోలేక, నీ మౌనం సహించలేక నీ మీద ప్రేమను నాకు నేనుగా చంపేసుకున్నా” అని ఎన్టీఆర్ ఫ్యాన్ పేర్కొన్నారు.
సగటు సినీ ప్రేమికుడిగా నీ సినిమా చూస్తా అంతవరకే సంతోషంగా ఉండు థ్యాంక్స్ నమస్తే అని తారక్ అభిమాని పేర్కొన్నారు.తారక్ ఫ్యాన్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న తారక్ రాబోయే రోజుల్లో అయినా చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.