ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ఆ సినిమా కోసం నటీనటులు రేయింబవళ్లు కష్టపడాల్సి ఉంది.రాజమౌళి సినిమాలు అంటే ఈ కష్టం మరింత ఎక్కువగా ఉంటుంది.
ఆర్.ఆర్.ఆర్ సినిమాతో సక్సెస్ సాధించిన తారక్ తాజాగా ఆ సక్సెస్ వెనుక ఉన్న కష్టాన్ని వెల్లడించారు.తాజాగా తారక్ ఒక సందర్భంలో మాట్లాడుతూ నాటు నాటు సాంగ్, ఇంటర్వెల్ లో యానిమల్ సీన్ అంత గొప్పగా ఉంటాయని ఊహించలేదని తెలిపారు.
గైడింగ్ సోల్ అంటూ తారక్ రాజమౌళిని తెగ మెచ్చుకున్నారు.జంతువులతో పాటు దూకే సీన్ లో వాహ్ అనిపించేలా కనిపించానని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
క్లైమాక్స్ సీన్స్ కోసం రాజమౌళి 65 రోజుల పాటు టార్చర్ చేశాడని తారక్ అన్నారు.నాటు నాటు సాంగ్ షూటింగ్ 12 రోజులు జరిగిందని ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఆ సాంగ్ షూట్ చేశారని తారక్ వెల్లడించారు.
ఉదయం 5.30 గంటలకు లేచి రిహార్సల్స్ లో పాల్గొనే వాళ్లమని 7 రోజులు నేను, చరణ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేశామని తారక్ తెలిపారు.సాంగ్ లో ఇద్దరి మధ్య సింక్రనైజేషన్ కోసం జక్కన్న ప్రెజర్ చేశారని అయితే ఆ సాంగ్ ప్రోమో విడుదలయ్యాక నా ఆలోచన మారిపోయిందని తారక్ అన్నారు.తారక్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు వచ్చే నెల నుంచి తారక్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నటించనున్నారు.
ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.మరోవైపు ప్రశాంత్ నీల్ సలార్ మూవీని రెండు భాగాలుగా షూట్ చేస్తుండగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి కానున్నాయని సమాచారం.తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ కు సంబంధించి కూడా త్వరలో అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.