ఎన్టీఆర్ అభిమానులకు పండుగలాంటి వార్త.. ఆ సినిమా రీ రిలీజ్?

టాలీవుడ్ స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల పై దృష్టిని పెట్టాడు.ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ మొదట్లో నటించిన ఆది సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది.వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా అప్పట్లో విడుదల ఈ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అన్న డైలాగ్ అప్పట్లో తెగ పాపులర్ అయింది.ఇది ఇలా ఉంటే ఆది సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాల నా సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు మరొకసారి తీసుకురావడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement
Junior Ntr Aadi Movie Re Release In Theaters , Jr Ntr, Aadi Movie, Tollywood, Re

ఇదే విషయాన్ని తాజాగా బెల్లంకొండ సురేష్ వెల్లడించారు.

Junior Ntr Aadi Movie Re Release In Theaters , Jr Ntr, Aadi Movie, Tollywood, Re

ఆది సినిమా రీ రిలీజ్ కోసం సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు.అయితే గత ఏడాది కేవలం ఫ్యాన్స్ షో మాత్రమే వేసాము ఈసారి ఎవరు ఊహించని విధంగా భారీగా విడుదల చేయాలి అనుకుంటున్నాము.చెన్నకేశవరెడ్డి సినిమాకు మంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అని చెప్పుకొచ్చారు సురేష్.

ఈ వార్తతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వీలైనంత త్వరగా సినిమాని విడుదల చేయాలి అనే ట్వీట్స్ చేస్తున్నారు అభిమానులు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు