'SSMB28' కోసం థమన్ రికార్డ్ రెమ్యునరేషన్.. మరీ అన్ని కోట్లా!

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్.ఎస్.తమన్ ఒకరు.ఈయన మొదట్లో ఎన్ని విమర్శలు ఎదుర్కున్న దృడంగా నిలబడి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.

 ‘ssmb28’ కోసం థమన్ రికార్డ్ రె-TeluguStop.com

ఈయన ప్రసెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.తమన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా సూపర్ హిట్ అవడమే కాకుండా అభిమానుల గుండెల్లో నిలిచి పోతున్నాయి.

అఖండ నుండి వరుస విజయాలు అందుకోవడంతో ఈయననే మళ్ళీ మళ్ళీ తమ సినిమాలకు రిపీట్ చేస్తున్నారు హీరోలు.ఇటీవలే మహేష్ బాబు థమన్ కాంబోలో సర్కారు వారి పాట సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

ఈసారి కూడా ఈ కాంబోలో మరో సినిమా రాబోతుంది.త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వస్తున్న SSMB28 కోసం తమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసారు.

ఈయన మ్యూజిక్ పరంగానే కాకుండా.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొడుతున్నాడు.

అందుకే ఈయనకు వరుస అవకాశాలు వస్తున్నాయి.ఇక తాజాగా థమన్ మహేష్ బాబు సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అయ్యింది.ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ కు భారీ మొత్తంలో పారితోషికాలు ఇస్తున్నారట.

Telugu Mahesh Babu, Pooja Hegde, Ss Thaman, Ssmb, Thaman, Trivikram-Movie

ఇక త్రివిక్రమ్ కూడా దాదాపు 60 కోట్లకు పైగానే ప్రాఫిట్స్ అందుకునే అవకాశం ఉంది.అలాగే మహేష్ బాబు 75 కోట్ల రెమ్యునరేషన్స్ అందుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

మరి ఇప్పుడు థమన్ రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ అయ్యింది.

ఈయన ఒక్కో సినిమాకు 2 కోట్లు అందుకుంటాడట.కానీ మహేష్ సినిమాకు మాత్రం నాలుగు నుండి ఐదు కోట్లు అందుకోనున్నాడని టాక్.

దీంతో ఈయన రెమ్యునరేషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.ఇక ఇటీవలే ఈ సినిమా రెగ్యురల్ షూట్ స్టార్ట్ చేసి శరవేగంగా యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube