Jr NTR: తారక్ సెన్సేషనల్ ప్లానింగ్ .. దేవర తర్వాత ఏ సినిమా షూట్ ?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా( Devara Movie ) షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

 Jr Ntr: తారక్ సెన్సేషనల్ ప్లానింగ�-TeluguStop.com

అయితే చూస్తూ ఉండగానే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే స్టేజికి వచ్చేసింది.మరి ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో నటిస్తాడు అనేది ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ టాపిక్ గా మారిపోయింది.

ఇప్పటికే బాలీవుడ్ లో హ్రితిక్ తో కలిపి వార్ 2 సినిమాకి( War 2 ) ఒప్పుకున్న జూనియర్ ఆ చిత్రం షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా మరి ఏదైనా సినిమా షూటింగ్ తెలుగులో మొదలవుతుందా అనే విషయాలు చర్చకు దారి తీస్తున్నాయి.మరి జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల సెన్సేషనల్ ప్లానింగ్ ఏంటో ఒకసారి చూద్దాం.

Telugu Acharya, Devara, Jr Ntr, Koratala Siva, Lavakusa, Ntr, Prashanth Neel, Ta

ఇక దర్శకుడు ఫ్లాప్ లో ఉన్నాడా హిట్ లో ఉన్నాడా అనే విషయంతో సంబంధం లేకుండా కథను మాత్రమే నమ్మి సినిమా తీయడంలో ఎన్టీఆర్( Jr NTR ) తర్వాతే ఎవరైనా.ఇప్పటికే ఆచార్య సినిమా( Acharya Movie ) పరాజయాన్ని చవిచూసిన కొరటాల శివకు( Koratala Siva ) దేవర సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.అంతకన్నా ముందు అరవింద సమేత చిత్రానికి ముందు కూడా త్రివిక్రమ్ కూడా ప్లాప్ ల్లో ఉన్నాడు.ఇక లవకుశ సినిమా సినిమాకు ముందు బాబి కూడా ప్లాఫ్ లో ఉన్నాడు.

అంత ఎందుకు పూరీ జగన్నాథ్ కూడా టెంపర్ చిత్రానికి ముందు ఫ్లాపులు ఎదుర్కొన్నాడు.అయినా కూడా కథను మాత్రమే నమ్మే ఏకైక హీరోగా ఉన్నాడు.

Telugu Acharya, Devara, Jr Ntr, Koratala Siva, Lavakusa, Ntr, Prashanth Neel, Ta

ఇక దేవర సినిమా తర్వాత వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్( Prasanth Neel ) సినిమాని మొదలు పెట్టాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నాడట.ఇప్పటికే సలార్ సీక్వెన్స్ కూడా వస్తుందని ప్రకటించినప్పటికీ దాని కన్నా ముందే తారక్ తో సినిమాను పూర్తి చేయాలని ప్రశాంత్ అనుకున్నట్టుగా తెలుస్తోంది.దాంతో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరగబోతోంది.అందుకే 2025 సంక్రాంతికి లేదా సమ్మర్ కి జూనియర్ మరియు ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube