ఆర్ఆర్ఆర్.ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు.
దేశం మొత్తం కూడా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యేందుకు సర్వం సిద్ధం అయ్యింది.మరొక రెండు రోజుల్లోనే మన సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ కానుంది.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ప్రకటించడంతో అందరు హ్యాపీ గా ఉన్నారు.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అన్ని చోట్ల జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.తాజా ఇంటర్వ్యూలో తారక్ ను తన ఫోన్ లో ఎక్కువగా ఏ పాట ప్లే అయ్యిందో అని హోస్ట్ అడిగారు.
అప్పుడు తారక్.వెంకటేష్ మహా డైరెక్షన్ లో వచ్చిన కంచరపాలెం చిత్రం లోని ఆశ పాశం బందీ చేసేనే.

అనే సాంగ్ పేరు చెప్పారు.అలాగే ఆ పాటను పాడి కూడా ఎన్టీఆర్ వినిపించడంతో హోస్ట్ కూడా సర్ప్రైజ్ అయ్యాడు.ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన క్లిప్ వైరల్ అయ్యింది.ఈ పాట తారక్ పాడడంతో ఫ్యాన్స్ కూడా సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు.

ఈ పాట ఎన్టీఆర్ పాడడంతో డైరెక్టర్ వెంకటేష్ మహా కూడా ట్విట్టర్ ద్వారా స్పందించి ఆయన ఆనందాన్ని వ్యక్తం చేసారు.పాట పట్ల తారక్ కు ఉన్న అభిమానానికి ధన్యవాదాలు అంటూ ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాడు.ఆర్ఆర్ఆర్ సినిమాతో ఘన విజయం సాధించాలని కూడా ఆయన తెలిపారు.ఇక ఈ సాంగ్ విన్న కొంతమంది మా ఫెవరెట్ సాంగ్ కూడా ఇదే అంటూ కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.








