అల్లు అర్జున్ కోసం రాని తారక్... ఎన్టీఆర్ రాకపోవడానికి అదే కారణమా?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా మహిళా అభిమాని మరణించడంతో అల్లు అర్జున్ ( Allu Arjun ) పరోక్షంగా కారణమని ఈయనపై కేసు నమోదు కావడమే కాకుండా పోలీసులు తనని అరెస్టు( Arrest ) చేసి కోర్టుకు హాజరు పరిచారు.

దీంతో కోర్టు తనకు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో పోలీసులు అల్లు అర్జున్ చంచల్ గూడా జైలుకు తరలించారు.

అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి మొత్తం జైలులోనే గడిపి శనివారం ఉదయం 6 గంటలకు జైలు నుంచి బయటకు వచ్చారు.

Jr Ntr Did Not Visit Allu Arjun Amidst Busy Shedule ,allu Arjun,ntr,war 2,arrest

ఇలా జైలు నుంచి బయటకు రాగానే అల్లు అర్జున్ సరాసరి ఇంటికి వెళ్లకుండా గీత ఆర్ట్స్ ( Gita Arts )ఆఫీస్ కి వెళ్లి అక్కడ న్యాయవాదులతో ఈ విషయం గురించి చర్చ జరిపిన అనంతరం జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు.అయితే అల్లు అర్జున్ అరెస్టు కావడంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం స్పందిస్తూ అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు.అదేవిధంగా ఈయన విడుదల కావడంతో పెద్ద ఎత్తున దర్శకులు నిర్మాతలు హీరోలు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనని పరామర్శించారు.

Jr Ntr Did Not Visit Allu Arjun Amidst Busy Shedule ,allu Arjun,ntr,war 2,arrest

ఇక ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో లేనటువంటి కొంతమంది హీరోలు ఫోన్ ద్వారా పరామర్శించారని తెలుస్తోంది.ఇలా ఎంతో మంది హీరోలు అల్లు అర్జున్ ఇంటికి వచ్చినప్పటికీ ఎన్టీఆర్ (Ntr) మాత్రం రాకపోవడంతో ఎన్నో రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య చాలా మంచి సాన్నిహిత్యం ఉంది ఇద్దరూ ఎంతో ప్రేమగా బావ అంటూ పిలుచుకుంటూ ఉంటారు.

Advertisement
Jr Ntr Did Not Visit Allu Arjun Amidst Busy Shedule ,Allu Arjun,Ntr,War 2,Arrest

అలాంటిది అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటికీ ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం లేకపోలేదు.ఈయన ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్ పనులలో ముంబైలో ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ని పరామర్శించడానికి రాలేదు కానీ ఫోన్ ద్వారా ఈయన అని వివరాలు అడిగి తెలుసుకున్నారని అలాగే అల్లు అర్జున్ తో కూడా మాట్లాడారని తెలుస్తోంది.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు