జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR ) తన సినీ కెరీర్ స్టార్ట్ చేసి 23 ఏళ్ళు అవుతుంది.మరి 23 ఏళ్ల కెరీర్ ను పూర్తి చెయ్యడం అంటే మామూలు విషయం కాదు.
ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుండి నందమూరి తారక రామారావు మనవడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన కెరీర్ లో చాలానే కష్టపడ్డాడు.
ఇప్పుడు పాన్ ఇండియన్ స్థాయికి చేరుకున్న ఎన్టీఆర్ ఈ రేంజ్ కు రావడానికి చాలానే కష్టపడ్డాడు.
నందమూరి కుటుంబం నుండి వచ్చిన తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.ఎన్టీఆర్( Junior NTR ) ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా( Global Star ) వెలుగొందుతున్న విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్( RRR ) వంటి ఒకే ఒక్క సినిమాతో అందరిని ఆకట్టుకున్న తారక్ క్రేజ్ అమాంతం పెంచుకున్నాడు.తన 23 ఏళ్ల కెరీర్ లో 29 సినిమాలను పూర్తి చేసుకున్న తారక్ ఇప్పుడు తన 30వ సినిమాను చేస్తున్నాడు.
తారక్ 2001లో ”నిన్ను చూడాలని”( Ninnu Choodalani ) అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.ఈ సినిమా సరిగ్గా ఇదే రోజు 23 ఏళ్ల క్రితం ఫిలిం సిటీలో షూటింగ్ స్టార్ట్ చేసుకుంది.
హీరోగా అప్పుడు మొదలైన ఎన్టీఆర్ నట ప్రస్థానం ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ కు చేరుకుంది.స్టూడెంట్ నెం 1 తో తొలిసారి సక్సెస్ చూసాడు ఎన్టీఆర్.ఈ సినిమా తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు.ఆది సినిమాతో( Aadi Movie ) మరో బ్లాక్ బస్టర్ అందుకుని మాస్ లో ఇమేజ్ బాగా పెంచుకున్నాడు.
ఇక సింహాద్రి( Simhadri ) విజయంతో స్టార్ హీరోగా టాలీవుడ్ లో నిలబడ్డాడు.సినిమా సినిమాకు తన రేంజ్ ను మార్చుకుంటూ ఇప్పుడు ఈయన క్రేజ్ విస్తరించుకున్నాడు.ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుండి వరుసగా 6 విజయాలు అందుకున్న ఏకైక హీరోగా రికార్డ్ క్రియేట్ చేసాడు.ఇక ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా( Devara ) చేస్తున్నాడు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.