మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమాని ఎన్టీఆర్ తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న తారక్ ఆ సినిమాని కంప్లీట్ చేసిన వెంటనే గ్యాప్ తీసుకోకుండా త్రివిక్రమ్ సినిమాకి రెడీ అయిపోతాడు.
ఈ సినిమాని వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి త్రివిక్రమ్ సైతం రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా కోసం కూడా ఒక ఓల్డ్ క్లాసిక్ ని మాటల మాంత్రికుడు రీమేక్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే అఆ సినిమాతో పాటు, అల వైకుంఠపురం సినిమాల కోసం త్రివిక్రమ్ ఓల్డ్ క్లాసిక్ మూవీస్ ని తన స్టైల్ లోకి మార్చేసుకున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా స్క్రిప్ట్ ఫినిష్ చేయడంతో పాటు కాస్టింగ్ ని కూడా లాక్ డౌన్ టైంలోనే ఫైనల్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.
ఈ నేపధ్యంలో అల, అరవింద సినిమాలలో హీరోయిన్ గా చేసిన పూజా హెగ్డేని మళ్ళీ ఈ సినిమాకి రిపీట్ చేయాలని అనుకున్న ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవడంతో మరో హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.అందులో కైరా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లు కూడా వినిపించాయి.
ఇప్పుడు కొత్తగా శృతి హసన్ పేరు వినిపిస్తుంది.శృతి హాసన్ మరల క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి రావడంతో ఆమె పేరుని చిత్రబృందం పరిశీలిస్తోందనే టాక్ వినిపిస్తోంది.
గతంలో రామయ్యా వస్తావయ్యా చిత్రంలో ఎన్టీఆర్ సరసన కథానాయికగా శృతి హసన్ నటించింది.మళ్ళీ ఈ కాంబినేషన్ రిపేట్ చేస్తే బాగుంటుంది అని త్రివిక్రమ్ కూడా ఆలోచిస్తున్నట్లు బోగట్టా.
మరి ఫైనల్ గా ఎన్టీఆర్ కి జోడీగా మాటల మాంత్రికుడు ఎవరిని ఫైనల్ చేస్తాడు అనేది చూడాలి.