బి ఆర్ ఎస్ పార్టీకి కొత్త భాష్యం చెప్పిన కమలం అద్యక్షుడు ......

బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్రీయ సమితి కాదంట బ్రష్టాచార్ రిష్వత్ సర్కార్ అంటే అవినీతి లంచగొండుల సర్కార్ అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda ) కొత్త అర్థం చెప్పారు.రానున్న ఎన్నికల సన్నాహాల్లో బాగం గా తెలంగాణలో పర్యటించాల్సిన జేపీ నడ్డా పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది.

 Jp Nadda Slams Kcr Goverment Policies , Jp Nadda , Kcr Goverment , Brs , Teal-TeluguStop.com

దాంతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్న నడ్డా తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర స్థాయి విమర్శలు చేశారు.విభజన నాటికి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్ప గా మార్చిన ఘనత కెసిఆర్(CM kcr ) దక్కుతుందని ఆయన విమర్శించారు ప్రభుత్వo మొత్తాన్ని ఆయన కుటుంబం కనుసన్నలలో నడుపుతున్నారని ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలన తగదంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Amit Shah, Jp Nadda, Kcr, Modi, Tealangana, Ys Jagan, Ysrcp-Telugu Politi

రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని అయితే ఆ స్థాయి అభివృద్ధి మాత్రం తెలంగాణలో కనబడటం లేదని మరి ఈ లక్షల కోట్లన్నీ ఏమైపోయాయంటూ ఆయన ప్రశ్నించారు ….రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడపడానికి మోడీ( Narendra Modi ) కష్టపడుతున్నారని, రెండు రాష్ట్రాలకు జాతీయ రహదారులు పెద్ద మొత్తం లో కేటాయించి వాటిని విస్తరిస్తునారని , రైల్వే లైన్ లను కేటాయించారని విమానాశ్రయాలు కేటాయించి పారిశ్రామికంగా ఎదగడానికి తోడ్పడుతున్నామని రాష్ట్ర అభివృద్ధి పూర్తిస్థాయిలో జరగాలంటే బిజెపికి అధికారాన్ని ఇవ్వాలంటూ ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు .

Telugu Amit Shah, Jp Nadda, Kcr, Modi, Tealangana, Ys Jagan, Ysrcp-Telugu Politi

ఒకపక్క బి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణకు కేంద్రం చేసింది ఏమీ లేదని ,పన్నులలో లో తమ వాటా కూడా సక్రమంగా ఇవ్వడం లేదని లెక్కలతో సహా వివరిస్తూ విమర్శలు చేసినా కూడా తెలంగాణకు చాలా చేశామంటూ చెబుతున్నారు తప్ప వాటి ఆధారాలను మాత్రం ప్రదర్శించడం లేదు.కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఇవ్వాల్సిన దానిలో కొంత ఇస్తున్నప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాముఖ్యతలో పదో వంతు కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వడం లేదన్నది బిజేపి మీద ఉన్న ప్రదాన ఆరోపణ .ఎన్నికల ప్రణాళికలలో భాగంగా ఎన్ని హామీలు ఇస్తున్నప్పటికీ వాస్తవ రూపం దాల్చిన హామీల శాతం చాలా తక్కువ అని లెక్కలు చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు బిజేపి సరైన జవాబు ఇవ్వలేదు మరి బీజేపీ మాటలను తెలంగాణ ప్రజానీకం ఏ మేరకు నమ్ముతారో రానున్న ఎన్నికల్లో తేలుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube