ఆ వ్యక్తుల వల్ల ఎన్టీఆర్ ఫ్రెండ్ గా చేసే ఛాన్స్ పోయింది.. జోష్ రవి షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో తన టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో జోష్ రవి ఒకరు.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన్ జోష్ రవి నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ ఫ్రెండ్ రోల్ లో నటించే అవకాశం ఎలా మిస్సైందో చెప్పుకొచ్చారు.

చిరంజీవి గారి సినిమాలో ఒక మూలన ఉన్నా నా జీవితానికి అది చాలని జోష్ రవి( Josh Ravi ) కామెంట్లు చేశారు.నేను చిరంజీవి గారిని నమ్మి సినిమాల్లోకి వచ్చానని ఆయన వెల్లడించారు.

చిరంజీవి గారు ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పరని చిరంజీవి గారి ఫ్యాన్స్ తప్పు చేసినట్టు ఎప్పుడూ వార్తలు రాలేదని జోష్ రవి అన్నారు.చిరంజీవి ఒప్పుకుంటే చచ్చిపోయేంత అభిమానం ఉందని ఆయన కామెంట్లు చేశారు.

సేనాపతి, దయా ద్వారా నాకు మంచి పేరు వచ్చిందని జోష్ రవి పేర్కొన్నారు.పవన్ సాధినేని( Pawan Sadhneni ) గారు నాకు మంచి ఆఫర్లు ఇచ్చారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Josh Ravi Comments About Ntr Friend Role Details Here Goes Viral In Social Media
Advertisement
Josh Ravi Comments About Ntr Friend Role Details Here Goes Viral In Social Media

ఎవరో ఏదో చెప్పారని ఆఫర్ ఇవ్వకపోవడం రైట్ కాదని జోష్ రవి పేర్కొన్నారు.చెప్పుడు మాటలు విని క్యారెక్టర్ డిసైడ్ చేయవద్దని ఆయన చెప్పుకొచ్చారు.నేను ఛాన్స్ అడుగుతాను కానీ అడుక్కోనని జోష్ రవి వెల్లడించారు.

అలాంటి నీచమైన బ్రతుకు నేను బ్రతకనని ఆయన అన్నారు.అవకాశాల కోసం చెడు మాటలు చెప్పకూడదని జోష్ రవి కామెంట్లు చేశారు.

Josh Ravi Comments About Ntr Friend Role Details Here Goes Viral In Social Media

నాన్నకు ప్రేమతో సినిమాలో నాకు ఛాన్స్ వచ్చిన తర్వాత ఎవరో ఏదో ఎదగడం కోసం నేను పాస్ పోర్ట్ పంపలేదని తప్పుగా చెప్పారని అలా చేయడం ద్వారా నాకు ఛాన్స్ పోయిందని జోష్ రవి అన్నారు.నాకు బదులుగా మరొకరు ఆ సినిమాలో ఛాన్స్ కొట్టేశారని జోష్ రవి వెల్లడించారు.జోష్ రవి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు