యాంకర్ నటుడు జోగినాయుడు( Joginaidu ) గురించి మనందరికీ తెలిసిందే.మొదట టీవీ యాంకర్ గా కెరియర్ ను మొదలుపెట్టిన జోగినాయుడు ఆ తర్వాత నటుడిగా మారారు.
స్వామి రారా, దృశ్యం, కుమారి 21 ఎఫ్, నువ్వలా నేనిలా, గుంటూరు టాకీస్ లాంటి సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జోగినాయుడు.ఇది ఇలా ఉంటే ఇటీవలె జోగి నాయుడుని ఏపీ ప్రభుత్వం ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషనర్ క్రియేటివ్ హెడ్గా నియమించిన సంగతి మనందరికీ తెలిసిందే.
కెరియర్ పరంగా బాగానే ఉన్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక రకాల ఒడిదురుకులను ఎదుర్కొన్నారు జోగి నాయుడు.
ఇతను ఫిమేల్ యాంకర్ ఝాన్సీ( Anchor Jhansi ) ని ప్రేమించి పెళ్లి చేసుకుని కూతురు పుట్టిన తర్వాత ఆమెతో విడిపోయారు.అయితే ఝాన్సీ తో కలిసి ఉండడానికి అతను ఎంతగానో ప్రయత్నించినప్పటికీ అందుకు ఝాన్సీ నిరాకరించగా చేసేదేమీ లేక విడాకులు తీసుకుని విడిపోయారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాయుడు తన మొదటి పెళ్లి విషయాల గురించి మాట్లాడుతూ.1995లో ఝాన్సీ నాకు తొలిసారి పరిచయం అయ్యింది.అప్పుడు ఆమె ఇంటర్ చదువుతోంది.
జీకే మోహన్ ( GK Mohan )తీసిన ఒక సినిమాలో తను నటించింది.అప్పుడు నేను జీకే మోహన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాను.
ఆ సమయంలోనే మా ప్రేమ చిగురించింది.
మేము కలిసున్న జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుని సంతోషపడుతూనే ఉంటాను.నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా, తను యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది.చిన్న స్థాయి నుంచి పైకి ఎదుగుతూ వచ్చాము.
దాదాపు తొమ్మిదేళ్లపాటు మేమిద్దరం కలిసే ఉన్నాము.కానీ ఇద్దరం మంచి స్టేజీకి వచ్చిన తర్వాత సమస్యలు మొదలయ్యాయి.
ఏడాదిలోనే విడిపోవాల్సి వచ్చింది.అప్పటికి మాకు ధన్య( Dhanya ) అనే కూతురు ఉంది.
అయితే మమ్మల్ని కలపడానికి కమెడియన్ బ్రహ్మానందం, మెగాస్టార్ చిరంజీవి ఎంతగానో ప్రయత్నించారు.నేను కూడా ఝాన్సీ తో కలిసి ఉండాలని అనుకున్నావు.
కానీ అది జరగలేదు.మా బంధం ఇంతవరకే అని రాసిపెట్టుందేమో, దాన్నెవరు ఆపగలరు? కానీ నాకున్న ఎమోషన్స్ వల్ల ఏడెనిమిది సంవత్సరాలు ఆ బాధలో నుంచి బయటపడలేకపోయాను.బ్రహ్మానందం ఒక తండ్రి స్థానంలో నిలబడి మమ్మల్ని కలిపేందుకు చాలా ప్రయత్నించారు.చిరంజీవి( Chiranjeevi ) కూడా మమ్మల్ని కూర్చోబెట్టి రెండు,మూడు గంటలపాటు మాట్లాడారు.కానీ వర్కవుట్ కాలేదు.తనతో నడిచిన ప్రయాణంలో జీవితకాలం సరిపడా జ్ఞాపకాలు పోగేసుకున్నాను అంటూ బాధను వ్యక్తం చేశారు జోగి నాయుడు.
ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు రెండవ పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.