ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అంటూ జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు..!!

ఈ ఏడాది అగరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఎన్నికలు ప్రపంచ దేశాలను బహుగా ప్రభావితం చేస్తాయి.

ప్రపంచంలోనే చాలా విషయాలలో అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంది.గత ఎలక్షన్ 2020లో జో బైడెన్ ( Joe Biden ) అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది.

ఆ సమయంలో అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఓటమిపాలయ్యారు.కానీ ఈసారి ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగనున్నాయి.

ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ తరఫున ట్రంప్ భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.మరోపక్క జో బైడెన్ సైతం.

Advertisement

ప్రచారం నిర్వహిస్తున్నారు.

పరిస్థితి ఇలా ఉండగా ఒకానొక సమయంలో సూసైడ్ ( Suicide )చేసుకోవాలనుకున్నానని అమెరికా అధ్యక్షుడు బైడెన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు.1972లో ఓ కారు ప్రమాదంలో నా భార్య, కుమార్తె కన్నుమూశారు.దాంతో మద్యానికి పూర్తిగా బానిసైపోయాను.

నదిలోకి దూకాలన్న పిచ్చి ఆలోచనలు వచ్చేవి.కానీ నా ఇద్దరు కుమారులు గుర్తొచ్చి ఆగిపోయేవాడిని అని వెల్లడించారు.1977లో జిల్ బైడెన్( Jill Biden )ను పెళ్లి చేసుకున్న జో, అప్పటి నుంచి ఆమెతో వైవాహిక బంధంలో బైడెన్ కొనసాగుతున్నారు.నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

అమెరికాలో ఈసారి ఎవరు అధ్యక్ష పదవి అధిరోహిస్తారు అన్నది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి
Advertisement

తాజా వార్తలు