తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ప్రభుత్వ సంచలన నిర్ణయాలను మొదలుకొని అధికార పక్షం ప్రతిపక్షాల మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.ప్రస్తుతం చాలా వరకు టీఆర్ఎస్ పైనే ప్రతిపక్షాలు ఎక్కు పెట్టడమే కాకుండా బీజేపీ లాంటి పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ ను కూడా ప్రయోగిస్తున్న పరిస్థితి కూడా ఉంది.
అయితే ఈ సమయంలో టీఆర్ఎస్ లో పదవుల కోలాహలం మొదలైందని చెప్పవచ్చు.అవే రాజ్యసభ పదవులు.
ఒకప్పటితో పోలిస్తే రాజ్యసభ పదవులు ఆశించే వారు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది.ఈ సమయంలో కెసీఆర్ మనసులో ఎవరు ఉన్నారనే దానిపైనే ఎక్కువగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది.

అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్న డీఎస్ కు మరల రాజ్యసభ ఇచ్చే అవకాశం వందకు వంద శాతం లేదు.అయితే వారి స్థానంలోనే కాక ఇంకా ఎవరైనా కొత్త నాయకులకు అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.అయితే ఆశావాదులు కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ ఎవరిని నిరాశకు గురి చేయకుండా సముచితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఎందుకంటే బీజేపీ ప్రస్తుతం ఉద్యమకారులను అదే విధంగా టీఆర్ఎస్ అసంతృప్తి నేతలపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టిన పరిస్థితిలో ఏ మాత్రం ఈటెల లాంటి స్థాయి నాయకుడు అసంతృప్తికి గురైతే టీఆర్ఎస్ కు పరోక్షంగా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది.
ఎందుకంటే వచ్చే రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రాకుండా చాలా జాగ్రత్తగా అడుగులేయాల్సిన అవసరం ఉంది.ఏది ఏమయినా కెసీఆర్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు మిగతావన్నీ ఊహాగానాలుగానే పరిగణించుకోవాల్సి ఉంటుంది.