తెలంగాణలో ప్రస్తుతం జీవో నెంబర్ 111( GO Number 111 ) కు సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.ఈ జీవో ను కేసిఆర్( KCR ) సర్కార్ ఎందుకు రద్దు చేసింది ? జీవో నెంబర్ 111 అసలు దేనికి సంబంధించినది ? దీనిపై ప్రతిపక్షలెందుకు రచ్చ చేస్తున్నాయి.ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.హైదరబాద్ పరిధిలోనూ ఉస్మాన్ సాగర్, హిమహత్ సాగర్ ల పరిరక్షణ కోసం 1996లో అప్పటి ప్రభుత్వం జోవో నెంబర్ 111 ను ప్రవేశ పెట్టింది.
ఈ జోవో యొక్క ముఖ్య ఉద్దేశం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు.ఎటువంటి కబ్జాకు మరియు కలుషిటానికి గురి కాకుండా చూడడం.

అయితే నిజాం పాలకుల సమయాల్లో సామాన్యులు త్రాగు నీటి కోసం ఈ రెండు జలాశయాలపై ఆధారపడవలసిన పరిస్థితి.అయితే ప్రస్తుతం నగర తాగునీటి అవసరాలు ఈ రెండు జలాశయాలపై ఆధారపడి లేవు. కృష్ణా, గోదావరి, జలాల( Krishna, Godhavari ) ద్వారా హైదరబాద్ ప్రజలకు త్రాగునీటి అవసరాలు తిరుతున్నాయి.దీంతో ఉస్మాన్ సాగర్, హిమహత్ సాగర్ జలాశయాలు తీవ్ర కలుషిటానికి లోనవగా.
పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దాంతో ప్రజల విన్నపంతో జీవో నెంబర్ 111 ను రద్దు చేయాలని కేసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.

జోవో 111 రద్దు చేసి భూములు ఆక్రమించుకునేందుకు కేసిఆర్ సర్కార్ చేసున్న ప్రయత్నమని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి థివ్ర విమర్శలు చేశారు.అంతే కాకుండా దీనిపై జాతీయ హరిత ట్రిబ్యూనల్ వెళ్తామంటూ కూడా స్పష్టం చేశారు.అటు బీజేపీ ( BJP )నేతలు కూడా ఇదే విధమైన విమర్శలు చేస్తున్నారు.
దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో జోవో 111 హాట్ టాపిక్ అయింది.కాగా 2019 లోనే 111 జీవో పరిధిలో కేసిఆర్ భూములు కొనుగోలు చేశారని రేవంత్ రెడ్డి( Revanth reddy ) చేస్తున్న ప్రధాన ఆరోపణ.
అలాగే ఔటర్ రింగ్ రోడ్ కూడా కబ్జా చేసేందుకు కూడా కేసిఆర్ చూస్తున్నారని, ఇదంతా కూడా దాదాపు లక్ష కోట్ల విలువ గలిగిన కుట్ర అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో నేషనల్ హరిత ట్రిబ్యునల్ ( NGT ) కి ఈ కేసు కేసిఆర్ కు నష్టమే అనేది కొందరు చెబుతున్నా మాట.మరి ఈ రగడ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
