Jitu Joseph : ప్రేమ కోసం సినిమాలనే వదిలేసిన దృశ్యం డైరెక్టర్….కానీ ఇప్పుడు

మలయాళ స్టార్ డైరెక్టర్ జీతూ జోసెఫ్( Jitu Joseph ) తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.2013లో మలయాళంలో ఆయన తీసిన "దృశ్యం"( drushyam ) సినిమా సూపర్ హిట్ కాగా దానిని తెలుగులో కూడా రీమేక్ చేశారు.

ఈ మూవీ ట్విస్టులు వేరే లెవెల్ లో ఉంటాయి.

ఇంత మంచి సినిమా తీసింది ఎవరా అని తెలుగు ప్రేక్షకులు ఆరా తీసి జీతూ జోసెఫ్ గురించి తెలుసుకున్నారు.ఇక ఈ డైరెక్టర్ దృశ్యం 2 ( drushyam2 )తెలుగు వెర్షన్ డైరెక్ట్ చేసి ఆకట్టుకున్నాడు.

ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 2007లో డిటెక్టివ్ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు.మొదటి సినిమాతోనే మంచి హిట్ సాధించాడు.2010లో "మమ్మీ అండ్ మీ" సినిమా తెరకెక్కించాడు.ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీలో అతిపెద్ద హిట్ సాధించింది.

మళ్లీ ఆయన చేసిన దృశ్యం సినిమానే ఈ మూవీ నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టింది.తర్వాత మై బాస్, మెమొరీ వంటి చిత్రాలు కూడా తీసి ఆకట్టుకున్నాడు.

Advertisement

అయితే ఇంత ప్రతిభ ఉన్న ఈ దర్శకుడు ప్రేమ కోసం ఒకానొక సమయంలో సినిమా రంగాన్నే వదిలేసాడు.ఇది వినడానికి షాకింగ్ గా అనిపించినా నిజం.

జీతూ జోసెఫ్ తండ్రి కేరళ( Kerala ) రాష్ట్రంలో ఎమ్మెల్యేగా కొనసాగారు.జీతూ జోసెఫ్ కు మాత్రం పాలిటిక్స్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు.

ఇంటర్మీడియట్ సమయంలో సినిమాలు చూడటం బాగా అలవాటు చేసుకున్నాడు.మంచి సినిమాలు చూస్తూ వాటిలాగా తాను కూడా సినిమాలు తీయాలని బాగా అనుకునేవాడు.

ఒకానొక సమయంలో సినిమాలు తీయాలనే పిచ్చి పట్టి మూవీ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నాడు.ఇంట్లో ఇదే విషయం చెప్తే డిగ్రీ పూర్తి చేయమని చెప్పారు.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

దాంతో డిగ్రీలో జాయిన్ అయ్యాడు.ఆ టైంలో చర్చిలో లిండా అనే అమ్మాయిని చూసి బాగా ఇష్టపడ్డాడు.

Advertisement

ధైర్యం చేసి ఆమె ముందు ప్రపోజల్ కూడా ఉంచాడు.అయితే లిండా జీతూ ఓ పోకిరి అనుకోని అతడి గురించి పెద్దగా పట్టించుకోలేదు.

కొన్ని రోజులకి తల్లిదండ్రులను వెంటబెట్టుకుని అమ్మాయి ఇంటికి వెళ్లాడు.ఆ అమ్మాయి పేరెంట్స్‌ ముందే ఆమెకు ప్రపోజ్ కూడా చేశాడు.అతని ధైర్యానికి లిండా ఆశ్చర్యపోయింది.

తర్వాత తెరుకొని లైఫ్‌లో ఏం సాధించాలని అనుకుంటున్నావు అని ప్రశ్నించింది.దానికి సినిమా ఇండస్ట్రీలో పని చేస్తానని జీతూ టక్కున చెప్పాడు.

దాంతో సినిమా వాళ్ళంటే తన పేరెంట్స్ కి ఇష్టం ఉండదు అని, వేరేదేదైనా ఫీల్డ్ లో కొనసాగమని ఆమె సలహా ఇచ్చిందట.ఆమె ప్రేమను వదులుకోలేక సినిమాలనే వదులుకున్నాడు జీతూ.

పెళ్లి అయ్యాక కూడా జీతూ సినిమాలు బాగా చూస్తూ గడిపేవాడు.అతడికి సినిమాల మీద ఉన్న పిచ్చి చూసి చివరికి లిండానే( Linda ) సినిమాల్లోకి వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రోత్సహించింది.అలా జీతు ఓ డైరెక్టర్ దగ్గర సహాయకుడిగా జాయిన్ అయి మూవీ కెరీర్ స్టార్ట్ చేశాడు.

ఆపై ఒక స్టోరీ రాసుకుని సినిమా తీద్దామని ప్రయత్నించాడు కానీ ప్రొడ్యూసర్ తప్పక ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు.చివరికి అమ్మ చిన్న డబ్బులతో డిటెక్టివ్ మూవీ తీసి చాలామంది దృష్టిలో పడ్డాడు.

ఆ తర్వాత కెరీర్ లైఫ్ లో వెను తిరిగి చూసుకోలేదు.

తాజా వార్తలు