2019లో అంబానీ సంప‌ద ఎంత పెరిగిందో తెలుసా?

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన రిలయెన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ 2019లో తన సంపదను భారీగా పెంచుకున్నారు.

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.

ఈ ఏడాది ఆసియాలోనే అందరి కన్నా ఎక్కువ సంపదను ముకేష్‌ పోగేసుకున్నారు.డిసెంబర్‌ 23వ తేదీ వరకు ఉన్న లెక్కల ప్రకారం ఈ ఏడాది ముకేష్‌ అంబానీ సంపద 1700 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.21 లక్షల కోట్లు) పెరగడం విశేషం.దీంతో కలిపి ముకేష్‌ మొత్తం సంపద విలువ 6100 కోట్ల డాలర్లు (సుమారు రూ.4.35 లక్షల కోట్లు)కు చేరింది.ఇదే సమయంలో అలీబాబా ఫౌండర్‌ జాక్‌ మా సంపద 1130 కోట్ల డాలర్లు పెరగగా.

అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మాత్రం తన సంపదలో 1320 కోట్ల డాలర్లు నష్టపోయారు.

ఈ ఏడాది రిలయెన్స్‌ షేర్ల విలువ 40 శాతం పెరగడంతో ముకేష్‌ అంబానీ తన సంపదను మరింత పెంచుకున్నారు.ఇంత వరకూ కేవలం ఆయిల్‌ రిఫైనింగ్‌, పెట్రోకెమికల్స్‌ బిజినెస్‌లోనే భారీగా సంపాదించిన అంబానీ.క్రమంగా టెలి కమ్యూనికేషన్స్‌, రిటెయిల్‌ బిజినెస్‌లోనూ భారీ లాభాలు ఆర్జించనున్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

ఊహించని రీతిలో జియోపై 5 వేల కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిన ముకేష్‌.దాని నుంచి భారీగా లబ్ధి పొందారు.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు