అంతరిక్షంలోకి జెఫ్ బేజోస్..?!

మనలో చాలామందికి గగనతలంలో విహరించాలని కోరిక ఉంటుంది అయితే అలా చేయడం ఇదివరకు అంత సులువైన విషయం కాదు.

అంతరిక్షంలో ప్రయాణించాలన్న కోరిక కూడా చాలామందికి ఉండే ఉంటుంది.

అయితే, ఈ కోరికను తాజాగా అమెజాన్ సంస్థ సీఈవో నెరవేర్చుకోబోతున్నాడు.తన చిన్నప్పుడు నుంచి అంతరిక్షంలో ప్రయాణించాలని ఆయన కలలు కనేవాడు.

అయితే ఇప్పుడు ఆ కల నెరవేరుతుందని తాను తనతో పాటు తన సోదరుడితో కలిసి అంతరిక్షంలో విహారించబోతునట్లు జెఫ్ బెజోస్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.ఆయనకు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ అర్జిన్ తయారుచేసిన న్యూ షెపర్డ్ రాకెట్ లో వీరిద్దరు జూలై 20వ తేదీన అంతరిక్షంలోకి పయనం కాబోతున్నారు.

అంతరిక్షం నుండి భూమిని చూస్తుంటే ఆ ఫీలింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో అంటూ బెజోస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ వీడియోని విడుదల చేశారు.ఈ మిషన్ లో జెఫ్ బెజోస్ అలాగే అతని సోదరుడు మార్క్ బెజోస్ తో సహా ముగ్గురు వ్యోమగాములతో టేకాఫ్ కాబోతోంది.

Advertisement

ఈ పోస్ట్ లో భాగంగా బెజోస్ తన అనుభూతిని తెలుపుతూ తన బంధాన్ని భూమితో మార్చేస్తుందని అంతరిక్షానికి వెళ్లడం ఓ సాహసమే అని తెలిపాడు.

వీరితో పాటు ఆన్లైన్ లో వేలం వేసి సీటుని దక్కించుకున్న వ్యక్తి కూడా ఇందులో ప్రయాణం చేయబోతున్నట్లు ఆయన తెలియజేశాడు.మే 5వ తేదీ నుండి ఒక సీటును ఆన్లైన్లో వేలం పెట్టారు.మే 19న ఆ వేలంలో ఆ సీటును ఏకంగా 2.88 మిలియన్ డాలర్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు.ఇకపోతే ఈ రాకెట్ లో మొత్తం ఆరుగురు ప్రయాణించవచ్చు.

ఈ ప్రయాణంలో భూమి నుండి 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళాక లైన్ వద్ద రాకెట్ లో క్యాపిటల్ నుండి బూస్టర్ వేరు అవుతుంది.ఆ సమయంలో అంతరిక్షం నుండి భూమి ఎలా కనబడుతుందో పూర్తిగా ఛాన్స్ ఉంటుందని ఆయన తెలియజేశాడు.అంతేకాదు గురుత్వాకర్షణ శక్తి లేకుండా అంతరిక్షంలో ఎలా ఉంటుందో అన్న ఫీలింగ్ కూడా ఆయన తెలియజేశారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు