ఏపీ రాజకీయం మొత్తం వాలంటీర్ల చుట్టూ తిరుగుతూ ఉంది.పెన్షన్ల పంపిణీ( Pension Disttribution ) విషయంలో వాలంటీర్ల జోక్యం ఉండకూడదని ఈసీ ఆదేశించటం సంచలనంగా మారింది.
ఈ క్రమంలో వృద్ధులు, వితంతువులకు తెలుగుదేశం పార్టీ నేతలు( TDP Leaders ) పెన్షన్లు ఇవ్వకుండా చేశారని అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.మరోపక్క పింఛన్లు పంపిణీ చేయించడానికి నిధులు కొరతే కారణం గాని ఎన్నికల కమిషన్, టీడీపీ కాదని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ( JD Laxmi Narayana ) నేడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా( Mukesh Kumar Meena )ను కలవడం జరిగింది.
అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఏపీలో ఎన్నికలు( AP Elections ) ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు స్పష్టం చేశారు.వాలంటీర్లు, మెప్మా సిబ్బందిని బదిలీ చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.సస్పెండ్ అయిన వాలంటీర్లు వైసీపీ( YCP )కి పనిచేస్తున్నారని ఆరోపించారు.
వాలంటీర్లను వారు పనిచేస్తున్న ప్రాంతం నుంచి దూర ప్రాంతాలకు పంపాలని లక్ష్మీనారాయణ అన్నారు.ఉత్తరాంధ్రలో పనిచేసే వాలంటీర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని సూచించినట్లు స్పష్టం చేశారు.
వాలంటీర్లు( Volunteers ) అదేచోట ఉంటే ఎన్నికలు పారదర్శకంగా జరగవని చెప్పుకొచ్చారు.అంతేకాకుండా అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.
మద్యం దుకాణాలలో డిజిటల్ చెల్లింపులు జరిగేలా చూడాలని కోరినట్లు జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేయడం జరిగింది.