కళ్లు మూసుకుని 120 కిలోమీటర్ల స్పీడ్ తో డ్రైవ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. అలా భయపెట్టాడంటూ?

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన జేడీ చక్రవర్తి( JD chakravarthy ) ఏ విషయం గురించి మాట్లాడినా స్ట్రెయిట్ గా మాట్లాడతారనే సంగతి తెలిసిందే.ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ మేఘాలలో తేలిపోతున్నది జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ సాంగ్ అని ఈ సాంగ్, మరో ఇష్టమైన సాంగ్ ప్లే చేసి మెహిదీపట్నం రోడ్ లో కారు ఎక్కించుకుని టోలిచౌకి రోడ్ వైపు తీసుకెళ్లాడని జేడీ అన్నారు.

 Jd Chakravarthy Shocking Comments About Junior Ntr Detaisl Here Goes Viral In So-TeluguStop.com

ఆ సమయం 100, 120 స్పీడ్ అంటే నేను భయపడేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.తారక్ 60 స్పీడ్ లో వెళ్లినా నేను భయపడేవాడినని ఆయన పేర్కొన్నారు.వెళ్తూ వెళ్తూ డ్రైవింగ్ లో కళ్లు మూసుకుంటే ఎలా ఉంటుందని తారక్( JR ntr ) చెప్పేవాడని అలా చెప్పడం వల్ల నాకు భయమేసిందని జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చారు.నేను నువ్వా నేనా అని తారక్ ను అడగగా నేను అని తారక్ చెప్పాడని జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చారు.

నువ్వు కళ్లు మూసుకుని డ్రైవ్ చేస్తే మాత్రం మనిద్దరం కూడా కళ్లు మూసుకునే పరిస్థితి వస్తుంది చూసుకో అని నేను అన్నానని జేడీ చక్రవర్తి వెల్లడించారు.అయితే తారక్ మాత్రం కళ్లు మూసుకుని డ్రైవ్ చేశాడని మధ్యమధ్యలో తెరిచి ఉంటాడని లేకపోతే ఈరోజు ఇలా బ్రతికి ఉండేవాడిని అయితే కాదని ఆయన కామెంట్లు చేశారు.మహేశ్వరి( Maheswari ) ఈ సాంగ్ కోసం తొలిసారి బైక్ ఎక్కిందని ఆయన వెల్లడించారు.

జూనియర్ ఎన్టీఆర్ ఏ కారులో తీసుకెళ్లాడో గుర్తు లేదని స్కోడా అని నా ఉద్దేశం అని జేడీ చక్రవర్తి అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ తో ఫోన్ లో టచ్ లో ఉండేవాడినని ఇప్పుడు మాత్రం టచ్ లో లేనని జేడీ చక్రవర్తి అన్నారు.నాకు గుడ్ కంటే బ్యాడ్ ఎక్కువగా గుర్తు ఉంటుందని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube