ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి( jd chakravarthy ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం నాకు శ్వాస సంబంధిత సమస్య( Respiratory problem ) వచ్చిందని అయితే నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని ఆయన అన్నారు.ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టపడ్డానని జేడీ చక్రవర్తి పేర్కొన్నారు.
ఎంతోమంది డాక్టర్లను సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు.నేను బ్రతకడం కష్టం అని డాక్టర్లు చెప్పారని జేడీ చక్రవర్తి వెల్లడించారు.
శేషు( Seshu ) అనే లాయర్ డాక్టర్ నాగార్జునను కలవాలని సూచించారని ఆయన అన్నారు.రీల్ లైఫ్ లో నాగార్జున( Nagarjuna ) లైఫ్ ఇస్తే రియల్ లైఫ్ లో కూడా అదే పేరు ఉన్న వ్యక్తి లైఫ్ ఇచ్చాడని జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చారు.
నాగార్జున గారు కొత్త తరహా పరీక్షలు చేయించారని ఆయన అన్నారు.నేను రోజూ తాగే కషాయం స్లో పాయిజన్ లా పని చేసిందని డాక్టర్ గుర్తించారని జేడీ చక్రవర్తి వెల్లడించారు.

ఆ కషాయం కొన్నిరోజులు తాగి ఉంటే పోస్టుమార్టంలో కూడా స్లో పాయిజన్ వల్ల చనిపోయానని తెలిసేది కాదని ఆయన పేర్కొన్నారు.బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్లు ఆ కషాయం తాగితే వెంటనే ఎఫెక్ట్ తెలుస్తుందని నాకు అన్నీ గుడ్ హ్యాబిట్స్ ఉండటం వల్ల ఆ కషాయం ఎఫెక్ట్ వెంటనే తెలియలేదని జేడీ చక్రవర్తి అన్నారు.యాంకర్ విష్ణుప్రియ( Vishnu Priya ) కొన్నిరోజుల క్రితం జేడీ చక్రవర్తి అంటే తనకు ఇష్టమని చక్రవర్తికి ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటానని ఆమె అన్నారు.

ఆ కామెంట్ల గురించి చక్రవర్తి స్పందిస్తూ విష్ణుప్రియ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చారు.విష్ణుప్రియతో కలిసి ఒక సిరీస్ చేశామని ఆ సిరీస్ షూట్ సమయంలో పవన్ సాధినేని జేడీ గారి సినిమాలు చూడాలని చెప్పడంతో ఆ పాత్రలతో విష్ణుప్రియ లవ్ లో పడ్డారని జేడీ చక్రవర్తి అన్నారు.మా ఇద్దరి మధ్య గురు శిష్యుల అనుబంధం ఉందని విష్ణుప్రియ మెసేజ్ లకు ఎక్కువగా రిప్లై ఇవ్వదని ఆయన చెప్పుకొచ్చారు.