తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ ఎదుట హాజరైయ్యారు.జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో విచారణకు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డిలు హాజరైయ్యారు.
ఈ క్రమంలో ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.జేసీ ట్రావెల్స్ సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను బీఎస్-4 గా మార్చి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు.
ఇప్పటికే జేసీ ట్రావెల్స్ పై కేసు నమోదు చేసిన ఈడీ.వారికి నోటీసులు జారీ చేసింది.ఈ క్రమంలో ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరు అయ్యారు.కాగా ప్రభాకర్ రెడ్డితో సహా 23 మందిపై ఫోర్జరీ కేసు నమోదు అయింది.







