అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీపై టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గండికోట కార్తీక్ రెడ్డిపై దాడి విషయంలో ఎలాంటి ఫిర్యాదు చేయమన్న ఆయన ఏపీలో పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోయిందని విమర్శించారు.
తమ అనుచరులపై దాడులు చేస్తున్నా డీఎస్పీ ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు.డీఎస్పీ చైతన్యపై ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.