ఏపీ సర్కార్ పాలనపై జయప్రకాష్ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు, అమరావతిలో తుగ్లక్ కూడా తరచూ రాజధానులు మార్చారు, రాజధానులు మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు.అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, ఇప్పటికైనా హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించాలని హితవు పలికారు.
అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని అది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలులు చేకూరుతుందని చెప్పారు.రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.
అది మారాల్సిన అవసరం ఎంతో ఉందని, ఏపీ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని, అప్పుచేసి పప్పుకూడు సరైన పద్ధతి కాదని, ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శిస్తే మంచిదని విమర్శలు వర్షం కురిపించారు.







