జయమ్ము నిశ్చయమ్ము రా రివ్యూ

చిత్రం : జయమ్ము నిశ్చయమ్మురా బ్యానర్ : శివరాజ్ ఫిలిమ్స్ దర్శకత్వం : శివరాజ్ కనుమూరి నిర్మాత : సతీష్ కనుమూరి సంగీతం : రవిచంద్ర విడుదల తేది : నవంబర్ 25, 2016 నటీనటులు : శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ, పోసాని, ప్రవీణ్ తదితరులు మొదటిసారిగా ముఖ్యపాత్రలో ప్రయత్నించి గీతాంజలి లాంటి హిట్ ని సాధించాడు శ్రీనివాస్ రెడ్డి.

అయినా కామేడియన్ పాత్రలు వదులుకోకుండా, ఓ 50 కథల్ని రిజెక్ట్ చేసి, మళ్ళీ హీరోగా చేసిన చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా".

శివరాజ్ కనుమూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు, అనగా నవంబర్ 25 న ప్రేక్షకుల ముందుకి రానుంది.ఈ చిత్రం యొక్క మొదటి ప్రీమియర్ షో నిన్న హైదరాబాద్ లో జరిగింది.

మరి రివ్యూ చుసేద్దామా.కథలోకి వెళితే : రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో, గవర్నమెంటు జాబ్ సంపాదించడానికి కష్టాలు పడే కరీంనగర్ జిల్లా వాసి శ్రీనివాస్ రెడ్డి.ఇతనికి ప్రభుత్వ ఉద్యోగం ఐతే వస్తుంది కాని, ఆంధ్రలోని కాకినాడలో పోస్టింగ్ పడుతుంది.

కొన్ని నెలల్లో తన ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ చేయించుకుందామని కాకినాడకు బయలుదేరిన హీరోకి అక్కడ అనుకోని కష్టాలు ఎదురవుతాయి.ఇటు తను ప్రేమించిన అమ్మాయి రాణి (పూర్ణ) ప్రేమను దక్కించుకోలేక, అటు తనకి కావాల్సిన ప్రాంతం బదిలీ పొందలేక, తన జాతకాల పిచ్చితో, అమాయకత్వంతో కాకినాడలో తంటాలు పడుతూ ఉంటాడు.

Advertisement

ఈ కష్టాలు దాటి మన కథానాయకుడు రాణి ప్రేమను, తన ట్రాన్స్ ఫర్ ని పొందగాలిగాడా లేదా అనేది తెరపైనే చూడాలి.నటీనటుల నటన గురించి : ఇన్నాళ్ళూ తన కామెడి టైమింగ్ తో ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి, ఈసారి పాత్రలో పోయగానే రూపు మార్చుకునే నీటిలా పాత్రలోకి మారిపోయాడు.ఉద్యోగం కోసం పడే కష్టాల దగ్గరినుంచి, ప్రేమ, ట్రాన్స్ఫర్ కోసం శ్రీనివాస్ రెడ్డి పడే తపన, కాసేపు నవ్వు తెప్పిస్తుంది, అవసరమైన చోట ఎమోషనల్ గా అనిపిస్తుంది.

స్వచ్చంగా, ఎలాంటి పైపూతలు లేకుండా సాగింది శ్రీనివాస్ రెడ్డి నటన.పూర్ణ కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది.హంగులు ఆర్భాటాలు లేని కథానాయిక కనబడి చాలా రోజులైంది అనేవారికి పూర్ణ పాత్ర మంచి రిలీఫ్.

ప్రవీణ్, పోసాని, కృష్ణ భగవాన్ క్యారక్టర్ ఆర్టిస్ బ్యాచ్ లో హైలట్ గా నిలవగా, మిగితా పాత్రధారులు తమ పరిధీమేరలో బాగా చేసారు.సాంకేతికవర్గం పనితీరు : నగేష్ బనేల్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు.రవిచంద్ర అందించిన సంగీతం మనం తరుచుగా చూసే సినిమా సంగీతం కాదు.

కాబట్టి అందరి కప్పు కాఫీ కాదు అన్నమాట.ఎడిటింగ్ మీద ఇంకాస్త శ్రద్ధ వహించాల్సింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
1000 కోట్లతో చరిత్ర సృష్టించిన పుష్పరాజ్.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమానే!

ముఖ్యంగా ఫస్టాఫ్ నరేషన్ మీద కంప్లయింట్స్ రావడం ఖాయం.నిడివి కొంచెం ఎక్కువైందనే చెప్పాలి.

Advertisement

ప్రొడక్షన్ వాల్యూస్ అంతంతమాత్రమె.విశ్లేషణ : దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది.ఎక్కడ అసజతత్వం కాని, సినిమా తాలూకు విపరీత వాసనలు కాని లేకుండా, సినిమా మొత్తం ఒకే టోన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది.

చాలాకాలం తరువాత వంశీ మంచి సినిమా తీసినట్టు, మనకు తెలిసిన పల్లె వాతావరణం, మనం చూస్తూ పెరిగిన పాత్రలే కనిపిస్తాయి.కథానాయకుడికి మనలో కొందరు పడే కష్టాలే ఎదురవుతాయి.

కాబట్టి ఎక్కడా, తన పాత్ర తాలూకు ఎమోషన్స్ నుంచి డిస్కనెక్ట్ కావడం జరగదు.ఫస్టాఫ్ స్లో గా ఉంది.

అదో పెద్ద కంప్లయింట్.ప్రీ ఇంటర్వల్ నుంచి సినిమా చాలా ఆసక్తిగా సాగుతుంది.

కాని ఎక్కడో, సినిమా నిడివి పెంచేస్తున్నట్టుగా అనిపిస్తుంది.కాని సినిమా మాత్రం హానెస్ట్ గా సాగుతుంది.

కమర్షియల్ హంగుల కోసం కథను దారి మళ్ళించలేదు.అలాగని అందరిని ఆకట్టుకునే కంటెంట్ కూడా కాదు.

దేశావాలి వినోదం అని ప్రమోట్ చేసినప్పుడు సినిమా ఆద్యంత పేస్ తో సాగాల్సింది.బిజినెస్ భాషలో చెప్పాలంటే యూనివర్సల్ సినిమా కాదు.

సినిమా మీద భిన్న అభిరుచి ఉన్నవారు, కాసేపు పక్కా మన నేటివిటి సినిమా చూడాలనుకునే వారు సంతృప్తి పొందవచ్చు.ప్లస్ పాయింట్స్ : * పాత్రలు, కథ * తెలుగు నేటివిటి * కొంత కామెడి మైనస్ పాయింట్స్ : * కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, అన్ని వర్గాల సినిమా కాకపోవడం (బిజినెస్ పరంగా) * స్లో నరేషన్ తెలుగు స్టాప్ రేటింగ్ : 2.75/5.

తాజా వార్తలు