సాధారణంగా ఎవరైనా తమ సినిమాను పిల్లలతో సహా చూడాలని ప్రమోట్ చేసుకుంటారు.అయితే జయం రవి( Jayam Ravi ) మాత్రం పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు అని ప్రమోట్ చేసుకున్నారు.
తన తర్వాత మువీ ఇరైవన్ గురించి ఈ కామెంట్లు చేశారు.జయం రవికి జోడీగా ఈ సినిమాలో నయనతార ( Nayanthara )నటించడం గమనార్హం.
తెలుగులో ఈ సినిమా గాడ్ పేరుతో థియేటర్లలో విడుదలవుతోంది.
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది.ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడం గురించి జయం రవి మాట్లాడుతూ అన్ని వయస్సుల ప్రేక్షకులను అలరించాలనే ఆలోచనతోనే నేను సినిమాలు చేస్తానని తెలిపారు.
కాకపోతే ఈ సినిమాను మాత్రం పిల్లలతో చూడవద్దని ఆయన కామెంట్లు చేశారు.
ఈ సినిమా ఏ సర్టిఫికెట్ మూవీ అని సినిమాలోని కొన్ని సీన్లకు పిల్లలు భయపడే అవకాశం ఉందని జయం రవి చెప్పుకొచ్చారు.మా సినిమా ఏ విధంగా ఉందో ట్రైలర్ తో పరిచయం చేశామని ఈ తరహా చిత్రాలను కొంతమంది ఇష్టపడతారని జయం రవి అన్నారు.వాళ్లు తప్పకుండా ఈ మూవీకి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నానని జయం రవి కామెంట్లు చేశారు.
ఆ తర్వాత జయం రవి లోకేశ్ కనగరాజ్( Lokesh Kanagaraj ) గురించి మాట్లాడుతూ లోకేశ్ కనగరాజ్ గతంలో నాకొక కథ చెప్పారని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదని లోకేశ్ గొప్ప దర్శకుడు అని అన్నారు.లోకేశ్ కనగరాజ్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలనిజయం రవి కామెంట్లు చేశారు.
జయం రవికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.