అలనాటి నటి జయలలిత( Jayalalitha ) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు ఈ ముద్దుగుమ్మ స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకులు దానికి అతుక్కుపోతారంటే అతిశయోక్తి కాదు.తెలుగులో కూడా జయలలిత నటించింది.“ఆలీబాబా 40 దొంగలు” ( Alibaba’s 40 Dongalu )సినిమాలో జయలలిత హీరోయిన్‌గా నటించి తెలుగువారి మనసులను దోచేసింది.ఇందులోని ఆమె నటనాభినయానికి చాలామంది ఫిదా అయిపోయారు.
ఈ సినిమాలోని “చల్లచల్లని వెన్నెలాయె మల్లెపూల పానుపాయె” పాటను కూడా ఆమె ఆలపించింది.ఆమె తెలుగులో పాడిన మొదటి పాట ఇది.తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా పాటలు పాడింది.తెలుగు తొలి పాటలో ఆమె అభినయం మనసులను హత్తుకుంటుంది.
అరేబియన్ నైట్స్ కథల ఆధారంగా ఆలీబాబా 40 దొంగలు సినిమా రూపొందింది.బి విఠలాచార్య( B Vithalacharya ) డైరెక్ట్ చేసిన ఈ మూవీలో NTR, జయలలిత, నాగభూషణం, సూర్యకాంతం, హేమలత, సత్యనారాయణ, మిక్కిలినేని, రాజబాబు, రమాప్రభ, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు తదితరులు నటించారు.
ఈ సినిమాలో జయలలిత అందం, గాత్రం, ఎన్టీఆర్ నటన, అద్భుతమైన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.ఇది తప్పక చూడవలసిన సినిమాగా నిలిచింది.
ఆలీబాబా 40 దొంగలు సినిమా థియేటర్లలో వంద రోజులకు పైగానే ఆడి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.NTR- విఠలాచార్య సినిమాలు 200 రోజులకు పైగా ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలా చూసుకుంటే ఈ సినిమా ఆశించిన రేంజ్ లో ఆడలేదని చెప్పుకోవచ్చు.విఠలాచార్య అసలైన కథలో చాలా మార్పులు చేసే ఎన్టీఆర్ స్టార్‌డమ్‌కు తగినట్లుగా సినిమాను తీశారు.
అయితే ఈ సినిమా చాలావరకు ప్రేక్షకులకు నచ్చింది కానీ ఎన్టీఆర్ నోట్లో వేలు పెట్టుకోవటం వంటి సన్నివేశాలు మాత్రం అస్సలు మెప్పించలేకపోయాయి.ఈ సీన్లు లేకపోతే ఈ మూవీ మరిన్ని రోజులు ఆడి ఉండేది.
ఇకపోతే ఘంటసాల( Gantasala ) కంపోజ్ చేసిన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ మూవీలో “అల్లా యా అల్లా”, “చలాకైన చిన్నది బలేబలేగున్నది”, “నీలో నేనై నాలో నీవై తీయని కలలే కందాము” , “భామలో చందమామలో”, “మరీ అంతగా బిడియమైతే మనసు ఆగనంటుంది” , “లేలో దిల్ బహార్ అత్తర్ దునియా మస్తానా” , “సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు” సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి ఇప్పటికీ వీటిని వింటూ ఎంజాయ్ చేసేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఆలీబాబా 40 దొంగలు సినిమాని 1956 లోనే తమిళంలో MGR రీమేక్ చేశాడు.భానుమతితో అలిసి ఈ సినిమాని రూపొందించాడు.మోడరన్ థియేటర్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ఈ మూవీని తెలుగులోకి కూడా డబ్బింగ్ చేశారు.ఈ సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడే ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది.
తమిళ రీమేక్ కలర్‌లో రావడం దానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది.ఒరిజినల్ సినిమాను యూట్యూబ్‌లో చూసి ఇప్పటిదాకా ప్రేక్షకులు కూడా మంచి అనుభూతిని పొందవచ్చు.