'జవాన్'తో షారుఖ్ సంచలనం.. ఆర్ఆర్ఆర్ రికార్డును రెండు వారాల్లోనే బీట్?

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) సౌత్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ”జవాన్”.ఈయన గత సినిమా పఠాన్ తోనే రికార్డులు క్రియేట్ చేసాడు అంటే ఇప్పుడు జవాన్ తో ఉన్న రికార్డులను కూడా చెరిపేస్తూ కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.

 Shah Rukh Khan Jawan 2 Weeks Collections, Jawan Movie, Shah Rukh Khan, Tollywoo-TeluguStop.com

మరి తాజాగా ఆర్ఆర్ఆర్ వంటి సినిమా క్రియేట్ చేసిన రికార్డును చెరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

జవాన్ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యి రిలీజ్ రోజు నుండే రికార్డులను క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది.

మొదటి రోజే రికార్డ్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ చేసిన జవాన్ ఒక్కో రికార్డును క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు.ఇప్పటికే జవాన్ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్న ఇంకా కలెక్షన్స్ రాబడుతూనే ఉంది.

వీక్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ వస్తున్నాయి.

Telugu Atlee Kumar, Bollywood, Jawan, Nayanthara, Rajamouli, Shah Rukh Khan, Sha

షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ జవాన్( Jawan ).ఈ సినిమా పఠాన్ ను మించిన హిట్ అయ్యి షారుఖ్ ఖాన్ ఖాతాలో మరో హిట్ పడేలా చేసింది.ఇక 14వ రోజు కూడా ఈ సినిమా 9 కోట్ల నెట్, 15 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.300 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఎప్పుడో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేసింది.

Telugu Atlee Kumar, Bollywood, Jawan, Nayanthara, Rajamouli, Shah Rukh Khan, Sha

ఇక ఓవర్సీస్ లో కూడా జవాన్ మ్యానియా అదిరిపోతోంది.అక్కడ ఇప్పటి వరకు 39.4 మిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 325 కోట్ల వరకు రాబట్టింది.ఒక్క నార్త్ అమెరికాలోనే 10 మిలియన్ డాలర్స్ రాబట్టింది.మన ఆర్ఆర్ఆర్ ( RRR ) అక్కడ 14.33 డాలర్స్ తో టాప్ లో ఉండగా ఇప్పుడు జవాన్ ఆ రికార్డుపై కన్నేసినట్టు అనిపిస్తుంది.ఇంకా క్లోజింగ్ కాలేదు కాబట్టి ఈ రికార్డును క్రాస్ చేసే అవకాశం కనిపిస్తుంది.

ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ జవాన్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 518 కోట్ల నెట్ కలెక్షన్స్, 922 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసింది.దీంతో నిర్మాతలకు ఏకంగా 218 కోట్ల లాభాలు వచ్చినట్టే అని చెప్పాలి.

మరి క్లోజింగ్ కలెక్షన్స్ లో ఇంకెన్ని లాభాలను అందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube