ప్రాపర్టీ ఫ్రాడ్‌కి పాల్పడ్డ ఎన్నారై.. చివరికి జైలు పాలు..

భారత సంతతికి చెందిన 64 ఏళ్ల జస్పాల్ సింగ్ జుట్లా( Jaspal Singh Juttla )కి తాజాగా యూకేలో మూడేళ్లపాటు జైలు శిక్ష పడింది.ఎందుకంటే ఈ ఎన్నారై ఇళ్లు కొనుగోలుదారులను మోసగించి వారి నుంచి దాదాపు 16,000 పౌండ్లు (దాదాపు రూ.16 లక్షలు) తీసుకున్నాడు.ఈ నేరాలు 2019, మే నుంచి 2021 జనవరి మధ్య జరిగాయి.

 Jaspal Singh Juttlaguilty Of Property Fraud Finally Jailed, Jaspal Singh Juttla,-TeluguStop.com

జస్పాల్ సింగ్ నలుగురు బాధితులను మోసం చేశాడు.

జస్పాల్ సింగ్ మోర్టగేజ్ అడ్వైజర్‌గా నటిస్తూ, ప్రాపర్టీలు కొనుగోలు చేయడంలో సహాయం చేస్తానని ప్రజలను నమ్మించాడు.

అతను లండన్‌( London )లోని వివిధ ప్రదేశాలలో తన క్లయింట్‌లను కలుసుకున్నాడు.మోర్టగేజ్ దరఖాస్తులను ఫిల్ చేయడానికి, సర్వేలను ఏర్పాటు చేస్తానని, న్యాయవాదులతో వాటిని కనెక్ట్ చేస్తానని నమ్మబలికాడు.

అతని మాటలను కొందరు నమ్మేశారు.అయితే బాధితులు అతనికి డబ్బులు చెల్లించిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలని జస్పాల్ సింగ్ డిమాండ్ చేశాడు.

Telugu Anita Sharma, Fraud, Jaspalsingh, London, Nri, Buyers, Scam, Victims-Telu

కొంతమంది బాధితులు ఎక్కువ డబ్బులు ఎందుకు ఇవ్వాలని అతడిని నిలదీశారు.సింగ్ వారిని శాంతింపజేయడానికి ఏవేవో సాకులు చెప్పాడు.కొన్నిసార్లు వారికి కొంత మొత్తంలో వాపసు కూడా ఇచ్చాడు.అయితే ఫుల్ అమౌంట్ రిఫండ్ చేయలేదని బాధితులు అతడిపై ఫైరయ్యారు.2021 జనవరిలో బాధితుల్లో ఒకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జస్పాల్ నేరాలను గుర్తించారు.

Telugu Anita Sharma, Fraud, Jaspalsingh, London, Nri, Buyers, Scam, Victims-Telu

వారు కేసును పరిశోధించారు.2022, జులైలో జస్పాల్‌పై అభియోగాలు మోపారు.ఇంకా ముందుకు రాని బాధితులు మరికొంతమంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఆర్థిక పరిశోధకురాలు, డిటెక్టివ్ కానిస్టేబుల్ అనితా శర్మ( Anita Sharma ) ఈ కేసు గురించి మాట్లాడుతూ జస్పాల్ తన జీవనం కోసం ప్రజల డబ్బును దోచేసాడని అన్నారు.అతడి నేరాలను బయటపెట్టేందుకు ముందుకు వచ్చిన వారిని ఆమె ప్రశంసించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube