బొరుగులు, పేలాలు ఇలా రకరకాల పేర్లతో పిలుచుకునే మరమరాలను( Puffed rice ) చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడతారు.వీటితో రకరకాల స్వీట్స్, స్నాక్స్ కూడా తయారు చేసుకుంటారు.
టీలో కూడా వీటిని వేసుకొని తాగుతుంటారు.అయితే విరివిగా తినే వీటిని ఎంత అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారో చూపించే ఒక వీడియో వైరల్ గా మారింది.
అమర్ సిరోహి అనే ప్రముఖ ఫుడ్ బ్లాగర్ ఇన్‌స్టాగ్రామ్( Instagram )లో షేర్ చేసిన ఈ వీడియో ప్రజలను షాక్‌కు గురి చేసింది.ఈ వీడియోలో మరమరాలు (పఫ్డ్ రైస్) ఎలా తయారు చేస్తున్నారో స్పష్టంగా కనిపించింది.అయితే ఈ ప్రక్రియ చాలా అపరిశుభ్రంగా ఉంది.వీడియోలో, ఒక కార్మికుడు తన కాళ్ళతో బియ్యాన్ని ( Rice )తొక్కుతూ, కడుగుతూ కనిపించాడు.ఆపై తన కాళ్ళతో ఆ బియ్యంలో ఉప్పు యాడ్ చేసి కలుపుతున్నట్లు కనిపించాడు.ప్రజలు ఈ ప్రక్రియ పరిశుభ్రత పట్ల అసహ్యం, ఆందోళన వ్యక్తం చేశారు.
అపరిశుభ్రమైన ప్రక్రియ ఉన్నప్పటికీ మరమరాలు తినడం గురించి కొంతమంది యూజర్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.మరికొందరు ప్రక్రియను ఆరోగ్యవంతంగా చేయడానికి యంత్రాలను, మెరుగైన పద్ధతులను ఉపయోగించాలని సూచించారు.ఒక వినియోగదారు కామెంట్ చేస్తూ.“అందుకే భారతదేశాన్ని మురికి దేశంగా చూస్తార”ని తీవ్ర విమర్శ చేశాడు.ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మరమరాలు తినడానికి ధైర్యం చేస్తారా అని కొందరు ప్రశ్నించారు.మరీ కాళ్లతో తొక్కుతూ చాలా మురికైన వాతావరణంలో వీటిని తయారు చేయడం ఏం బాగోలేదని అంటున్నారు.
ఈ వైరల్ వీడియో ని మీరు కూడా చూసేయండి.