జాన్వీ మరో ఆఫర్ కొట్టేసిందా.. ఏకంగా అగ్ర డైరెక్టర్ మూవీలో ఛాన్స్?

బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) కూడా ఉంది.

ఈమె హీరోయిన్ గా ధఢక్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వక పోయిన జాన్వీ అందం, నటనకు మంచి పేరు అయితే వచ్చింది.ప్రెజెంట్ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు అయితే చేస్తూ బిజీగా ఉంది.

తాజాగా ఈమె నటించిన మిలి సినిమా( Mili movie ) మంచి విజయం సాధించడమే కాదు.నటిగా మరో అడుగు పైకి ఎక్కింది.

ఇక ప్రెజెంట్ జాన్వీ కపూర్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.మరి ఈమె బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే సౌత్ ఎంట్రీకి కూడా సిధ్దం అవుతుంది.జాన్వీ కపూర్ చాలా రోజులుగా తెలుగు మూవీ చేయడం కోసం ఎదురు చూస్తుంది.

Advertisement

ఈ క్రమంలోనే కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులో జాన్వీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.

జాన్వీకి ఇదే తొలి పాన్ ఇండియన్ మూవీ కావడం విశేషం.అందుకే ఈ సినిమా కోసం ఈమె చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంది.మరి ఈమె ఇంకా మొదటి పాన్ ఇండియన్ సినిమా పూర్తి చేయనేలేదు.

తాజాగా ఈమె మరో పాన్ ఇండియన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని వార్తలు వస్తున్నాయి.అది కూడా రాజమౌళి ( Rajamouli )నెక్స్ట్ చేయబోయే సినిమాలో ఆఫర్ అందుకుంది అని టాక్ వినిపిస్తుంది.

మరి ఈ రూమర్ పై తాజాగా ఒక క్లారిటీ అనేది వచ్చింది.ప్రజెంట్ వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో వాస్తవం లేదని కేవలం పుకార్లు మాత్రమే అని అంటున్నారు.ఇంకా ఈ సినిమా స్టోరీ రైటింగ్ స్టేజ్ లోనే ఉందని.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

పక్కాగా స్క్రిప్ట్ సిద్ధం అయ్యాక మాత్రమే నటీనటులను ఫైనల్ చేయనున్నారట.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు